ప్రాణం తీసిన వివాహేతర సంబంధం... ఉన్మాదిలా మారి...

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో... గతంలో తాను పని చేసిన షాపు ఓనర్‌ను హత్య చేశాడు ఆమె భర్త

news18-telugu
Updated: July 15, 2019, 5:09 PM IST
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం... ఉన్మాదిలా మారి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వివాహేతర సంబంధం ఓ యువకుడి నిండు ప్రాణాలను బలితీసుకుంది. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఓ వ్యక్తిని నడ్డిరోడ్డుపైనే నరిచంపాడు ఆమె భర్త. చోడవరం మండలం బెన్నవోలు గ్రామానికి చెందిన పండూరు సత్తిబాబు గతంలో చోడవరంలో వస్త్ర దుకాణాన్ని నిర్వహించాడు. అతడి షాపులో పని చేసిన రాజేష్ అనే యువకుడి భార్యతో సత్తిబాబుకు పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. సత్తిబాబుకు ఈ విషయం తెలియడంతో రాజేష్‌తోపాటు తన భార్యను కూడా మందలించాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రాజేష్‌ను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఆదివారం మధ్యాహ్నం చోడవరం మద్యం దుకాణం దగ్గరకు వచ్చిన రాజేష్‌పై హెల్మెట్ పెట్టుకుని వచ్చిన సత్తిబాబు కత్తితో దాడి చేశాడు. మెడ, చేతులపై పలుమార్లు బలంగా నరికాడు. దీంతో రెండు చేతులు పూర్తిగా తెగిపోయాయి. అనంతరం నిందితుడు బైక్‌పై కొంతదూరం వెళ్లిపోయిన సత్తిబాబు... మరోసారి వెనక్కి వచ్చి ఇంకో రెండుసార్లు నరికాడు. ఇంతటితో సత్తిబాబు కోపం చల్లారలేదు. తన భార్యను కూడా చంపాలని భావించి తన స్వగ్రామానికి బయలుదేరాడు.

హత్య విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడి గురించి తెలుసుకుని వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఓ వీధిలో కనిపించిన అతనిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.First published: July 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...