బిల్డింగ్ పై ఓ కుర్రాడి శవం.. అతడి చేతుల్లో లభ్యమైన వెంట్రుకలు.. ఫోన్ కాల్ డేటాతో బయటపడ్డ మర్డర్ మిస్టరీ..!

ప్రతీకాత్మక చిత్రం

ఓ కుర్రాడు కనిపించకుండా పోయాడు. అతడి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే దగ్గరలో ఉన్న ఓ బిల్డింగ్ పై అతడి శవాన్ని గుర్తించారు. అతడి చేతి వేళ్లల్లో కొన్ని వెంట్రుకలు ఉండటాన్ని చూసి..

 • Share this:
  తన భార్యతో అత్యంత సన్నిహితంగా ఓ వ్యక్తి ఉన్న ఫొటోలను ఆ భర్త చూశాడు. అంతే ఒక్కసారిగా షాకయ్యాడు. అతడు తనకు బంధువే కావడంతో మోసపోయానని గ్రహించాడు. భార్యను నిలదీశాడు. ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత అతడిని చంపేయాలని ప్లాన్ చేశాడు. తన భార్యతో వివాహేతర సంబంధం నడుపుతున్న విషయం తెలిసిందన్నది అతడికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. అతడిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే అతడిని చంపేసి శవాన్ని అక్కడే వదిలేసి వచ్చాడు. కానీ అతడు కనిపించకపోవడంతో తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. శవం కూడా బయటపడటంతో విచారణ ప్రారంభించారు. అతడి చేతుల్లో ఎంట్రుకలు ఉండటంతో అసలు విషయం బయటపడింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ పరిధిలో జవహర్ పురీకి చెందిన 22 ఏళ్ల భీమ్ లోధీ అనే కుర్రాడు స్థానికంగా ఉన్న బీర్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. అతడు ఏప్రిల్ 5వ తారీఖు నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అతడి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అదే సమయంలో కొన్ని గంటల వ్యవధిలోనే దగ్గరలో ఉన్న రైల్వే కాలనీలో ఓ బిల్డింగ్ పై అతడి శవాన్ని గుర్తించారు. అయితే లోధీ చేతి వేళ్లల్లో కొన్ని వెంట్రుకలు ఉండటాన్ని పోలీసులు గమనించారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించారు. ఇదే సమయంలో లోధీ ఫోన్ కాల్ డేటాను పోలీసులు బయటకు తీశారు. అతడు తరచుగా ఓ మహిళతోనూ, అషు అనే వ్యక్తితోనూ మాట్లాడుతున్నాడని కాల్ డేటాలో వెల్లడయింది. ఆ మహిళ, అషు ఇద్దరూ భార్యాభర్తలే కావడం గమనార్హం. దీంతో అషూను పట్టుకుని నిలదీశారు.

  పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తే అషు నిజం ఒప్పుకున్నాడు. ‘ నా భార్యతో లోధీకి వివాహేతర సంబంధం ఉంది. నాకు ఈ మధ్యనే ఆ విషయం తెలిసింది. నా భార్య ఫోన్లో వాళ్లిద్దరూ అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటోలను చూశాను. నా భార్యను నిలదీస్తే విషయం అంతా చెప్పింది. లోధీ నన్ను మోసం చేశాడు. ఇద్దరం కలిసి డ్రగ్స్ తీసుకునేవాళ్లం. అదే విషయం చెప్పి లోధీని రైల్వే కాలనీకి తీసుకెళ్లా. అక్కడ లోధీ కాస్త మత్తులోకి వెళ్లగానే ఇటుక రాయితో తలపై కొట్టా. నాతో కాసేపే గొడవ పడ్డాడు. ఆ తర్వాత స్పృహతప్పాడు. నేను వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి చంపేశా‘ అని అషు వెల్లడించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని రిమాండ్ కు తరలించారు.
  Published by:Hasaan Kandula
  First published: