Husband Jumps Into Wifes Burning Pyre : ఇటీవల చాలామంది చిన్న చిన్న కారణాలకు ఉరేసుకోవడం, పురుగుల మందు తాగి ఆత్మహత్యలకు(Suicide) పాల్పడటం చూస్తున్నాం. నిండు జీవితాలను ఆవేశంతో, ఆలోచనారాహిత్యంతో బుగ్గిపాలు చేసుకుంటున్నారు. నమ్ముకున్న కన్న తల్లిదండ్రులను(Parents).. వాళ్లపై ఆధారపడిన కుటుంబసభ్యులను(Family) ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఘటన చోటు చేసుకుంది. ఉత్తర్ప్రదేశ్ మహోబా జిల్లా జైత్పుర్ గ్రామానికి చెందిన బ్రిజేష్, ఉమ దంపతులు నివసిస్తున్నారు. అయితే ఇటీవల ఉమ అనారోగ్యం పాలైంది. దీంతో ట్రీట్మెంట్ చేయించుకుంటేగానీ తన అనారోగ్యం నయం కాదని భావించింది. దీంతో ట్రీట్మెంట్ కోసం రూ.5 వేలు కావాలని భర్త బ్రిజేష్ను అడిగింది ఉమ.
అయితే తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తర్వాతి రోజు ఇస్తానని భర్త చెప్పి సమాధానంతో కలత చెందిన ఉమ అత్మహత్య చేసుకుంది. ఉదయం లేచి చూసేసరికి ఉమ ఉరివేసుకుని కనిపించింది. వెంటనే ఉమను జిల్లా హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధరించారు .పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని జైత్ పుర్ పట్టణంలోని దియోధి శ్మశానవాటికకు అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు. అయితే భార్య ఆత్మహత్యతో మనస్తాపానికి గురైన బ్రిజేష్..మండుతున్న భార్య చితిలోని దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడున్న వ్యక్తులు అతడిని పట్టుకుని బయటకు తీశారు. తన భార్య చిన్న కారణానికే ఆత్మహత్యకు పాల్పడిందని.. ఆమె చనిపోయాక తనకు బతకాలని లేదని బ్రిజేష్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే,కట్నం కోసం భర్త, అత్తమామలే తమ కూతుర్ని హత్య చేశారని ఉమ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు, రాజస్థాన్ లో (Rajasthan) దారుణం చోటు చేసుకుంది. పాలి జిల్లా పరిధిలో వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పాలిలో నివసించే ఛగన్ లాల్ (30) కి పెళ్లై ఇద్దరు పిల్లలు. ఇతను అదే గ్రామంలో పెళ్లైన మహిళ మమతా(23) తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మహిళ మోజులో పడి భార్యను కూడా విడిచిపెట్టాడు. ఈ క్రమంలో దాదాపు.. ఐదేళ్ల పాటు అక్రమ సంబంధం కొనసాగింది.దీంతో ఛగన్.. మమతను పెళ్లి చేసుకోవాలంటూ (Married woman) కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో అతను ఆవేశంతో రగిలిపోయాడు. అదే విధంగా, మమత మోజులో పడి భార్యను వదిలేశానని బాధపడ్డాడు. గత శుక్రవారం మమత ఇంట్లోకి ఛగన్ ప్రవేశించాడు. మమత కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. ఆమెపై గన్ తో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత.. ఛగన్ కూడా తనను తాను (Man commits suicide ) కాల్పుకున్నాడు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మమతకు అత్యవసర విభాగంలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. బాధితురాలు చికిత్స తీసుకుంటు శుక్రవారం మృతి చెందింది. ఇక ఛగన్.. శనివారం చికిత్స అందిస్తుండగా మృత్యువాత పడ్డాడు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.