నగలు వేసుకోనివ్వట్లేదు... భర్తపై పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చిన భార్య

మహిళలకు నగలు, అలంకరణపై ఎంతో ఆసక్తి ఉంటుంది. అలాంటివి అవే వేసుకోవద్దంటే... ఎవరికైనా మండుతుంది. ఆమెకి కూడా ఫుల్లుగా కోపం వచ్చింది. పంచాయితీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 18, 2019, 2:58 PM IST
నగలు వేసుకోనివ్వట్లేదు... భర్తపై పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చిన భార్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ ప్రైవేట్ యూనివర్శిటీలో పనిచేస్తున్న స్మిత (35)... పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తన 39 ఏళ్ల భర్తపై గృహ హింస కేసు పెట్టింది. ఇక తనతో కలిసుండటం తన వల్ల కాదన్న ఆమె... విడాకులు ఇచ్చేయమనండి అని కోరింది. అతను ఏం తప్పు చేశాడో వివరించింది. గుజరాత్... వస్త్రాపూర్‌లో ఉండే స్మితకీ... ఐటీ ఉద్యోగి అయిన జిగార్ (పేరు మార్చాం)కీ 2016లో పెళ్లైంది. వాళ్లకు రెండేళ్ల పాప ఉంది. ఆగస్ట్ 15న రక్షా బంధన్ రోజున తమ ఇంటికి రమ్మని భార్యాభర్తలిద్దరూ... ఆగస్ట్ 13న తమ బంధువుల్ని ఆహ్వానించారు. అదే రోజు అర్థరాత్రి వేళ బెడ్‌పై పడుకొని ఉన్నప్పుడు... జిగార్‌కీ, స్మితకీ మధ్య చిన్నగా గొడవ మొదలైంది. ఇంటికి వచ్చిన బంధువుల కోసం భోజనాలు, ఇతర ఖర్చుల కోసం ఆమె బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బును ఖర్చు చేద్దామన్నాడు జిగార్. అందుకు ఆమె ఒప్పుకోలేదు. మీ దగ్గర డబ్బు లేనప్పుడు... మీ చుట్టాల్ని ఎందుకు పిలిచారు. సైలెంట్‌గా ఉండకపోయారా అంది. అంతే... ఇద్దరి మధ్యా మాటల యుద్ధం జరిగింది. ఇప్పటికిప్పుడు ఇంటి నుంచీ వెళ్లిపో... లేదంటే... మీ పేరెంట్స్ ఇద్దర్నీ పీకపిసికి చంపుతా అని బెదిరించాడు. అతనిలో క్రూరత్వాన్ని చూసిన ఆమె భయపడింది. అప్పటికప్పుడు ఇంట్లోంచీ బయటకు వెళ్లిపోయింది. తనతోపాటూ కూతుర్ని కూడా వెంట తీసుకుపోయింది.

పెళ్లైన కొత్తలో వాళ్ల మధ్య ఎలాంటి గొడవలూ లేవు. పాప పుట్టిన తర్వాత నుంచీ అతనిలో మార్పు మొదలైంది. మాటిమాటికీ ఆమెను ఏదో ఒక రకంగా వేధిస్తున్నాడు. చాలా సందర్భాల్లో ఆమె దగ్గరున్న డబ్బును వాడేస్తూ... ఇద్దరం భార్యాభర్తలం... నీదీ, నాదీ ఏంటీ అంటూ నాటకాలాడాడు. అంతే కాదు... ఆమె పుట్టింటి నుంచీ తెచ్చుకున్న 20 తులాల బంగారు నగలను ఏనాడూ పెట్టుకోనిచ్చేవాడు కాదు. అసలా నగల పెట్టెను ఆమెకు అందకుండా... ఎక్కడో దాచిపెట్టాడు. ఎప్పుడైనా నగలు పెట్టుకుంటానంటే చాలు... దొంగలు దోచుకుపోతారు, అంత అవసరం ఏముంది? అందంగానే ఉన్నావుగా... నగలెందుకు? ఇలా ఏవో ఒక మాటలు చెప్పి... నగలు మాత్రం వేసుకోనివ్వకుండా చేస్తున్నాడు.

ఓ రోజు ఆమె... నగల కోసం బీరువా మొత్తం వెతికింది. ఇంట్లో ఎక్కడెక్కడో వెతికింది. భర్త డ్యూటీ నుంచీ ఇంటికి వచ్చాక... నగలెక్కడ పెట్టారని అడిగింది. వాటిని బ్యాంకులోని తన లాకర్‌లో దాచిపెట్టానని చెప్పాడు. నాకు చెప్పకుండా అలా ఎందుకు చేశారంటే... అది మన మంచికే అంటూ మెల్లగా జారుకున్నాడు. అంతేకాదు... పెళ్లి రోజున జరిగిన వీడియో షూటింగ్‌లో అందరూ స్మిత అందంగా బాగుందని మెచ్చుకోవడం, ఆమె ముందు అతను తేలిపోయాడని అనడం కూడా జిగార్‌కి నచ్చలేదు. ఆ కోపంతో... ఆమెను ఏనాడూ పుట్టింటికి వెళ్లనివ్వలేదు. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఇక్కడే ఉండు అంటూ ఆంక్షలు విధించాడు.

స్మిత ద్వారా ఇవన్నీ తెలుసుకున్న పోలీసులు... జిగార్‌కి కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అప్పటికీ అతను మారకపోతే... తాట తీసైనా దారిలోకి తెచ్చే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు