భర్తను ప్లాన్ చేసి జైలుకు పంపి... అందమైన యువతిపై గ్యాంగ్ రేప్

ఒకరి తర్వాత ఒకరు ఆమెను అనుభవించారు. అనంతరం తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఆమెను చంపేందుకు కూడా సిద్ధమయ్యారు.

news18-telugu
Updated: January 21, 2020, 9:46 PM IST
భర్తను ప్లాన్ చేసి జైలుకు పంపి... అందమైన యువతిపై గ్యాంగ్ రేప్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సినిమా రేంజ్‌లో స్కిప్ట్ తయారు చేశారు. దాన్ని అమలు చేశారు. అనంతరం అతడి భార్య మీద గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బరేలీ జిల్లాలోని సిరౌలీ గ్రామంలో ఓ జంట ఉంది. ఆ యువతి అందంగా ఉంటుంది. దీంతో ఆమె మీద ఇరుగు పొరుగున ఉండే యువకుల కన్ను పడింది. భర్త పక్కన ఉండగా ఆమె మీద తమ కామ వాంఛ తీర్చుకోలేమని భావించారు. అందు కోసం వారంతా కలసి ఓ పథకం పన్నారు. దొంగతనం ప్లాన్ చేసి ఆమె భర్తను ఆ నేరంలో ఇరికించారు. అతడు మొరాదాబాద్ జిల్లా జైల్లో ఉండగా తమ కుట్రను అమలు చేశారు.

గత శుక్రవారం రాత్రి ఆమె తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ గ్రామానికి చెందిన నలుగురు యువకులు యువైస్, నాజుక్ బేగ్, రియాసత్ బేగ్, అఫ్జల్ ఆమె ఇంట్లోకి దూరారు. ఆమె నోట్లో గుడ్డలు కుక్కేశారు. విడతల వారీగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు ఆమెను అనుభవించారు. అనంతరం తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఆమెను చంపేందుకు కూడా సిద్ధమయ్యారు. కత్తితో ఆమె గొంతు కోసారు. కానీ, ఎలాగో ప్రాణాలతో బయటపడిన ఆమె గ్రామంలోని ఇరుగుపొరుగు వారిని అలర్ట్ చేసింది. దీంతో నలుగురు నిందితులు పారిపోయారు. నలుగురు నిందితుల్లో ఒకడైన అఫ్జల్ తన భర్తను ప్లాన్ ప్రకారం దొంగతనం కేసులో ఇరికించి తన మీద ఇలా అఘాయిత్యానికి ఒడిగట్టాడని బాధితురాలు ఆరోపించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: January 21, 2020, 9:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading