భార్యపై స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేయించిన భర్త... చేతులు కట్టేసి..

ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య మీదే గ్యాంగ్ రేప్ చేయించాడు. తన స్నేహితులతో కలసి అతడు కూడా ఆమె మీద అత్యాచారంలో పాల్గొన్నాడు.

news18-telugu
Updated: January 20, 2020, 8:02 PM IST
భార్యపై స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేయించిన భర్త... చేతులు కట్టేసి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య మీదే గ్యాంగ్ రేప్ చేయించాడు. తన స్నేహితులతో కలసి అతడు కూడా ఆమె మీద అత్యాచారంలో పాల్గొన్నాడు. ఒడిశాలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవరంగపూర్‌ జిల్లాలోని ఉమ్మర్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చొడైగుడ గ్రామానికి చెందిన సజు హరిజన్‌‌, ఓ యువతిని ప్రేమించాడు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ కలసి వెళ్లిపోయి పెళ్లిచేసుకున్నారు. అయితే, ఆమె అత్తవారింట్లో కూడా నిరాశే ఎదురైంది. దీంతో కొత్త జంట వేరే ఇంట్లో కొత్తకాపురం పెట్టింది. నెల రోజుల పాటు సాగిన కొత్తకాపురం బాగానే ఉంది. అయితే, నెల తర్వాత వారి కాపురంలో కలహాలు వచ్చాయి. దీంతో భార్యను కొట్టి ఇంటి నుంచి పంపేశాడు సజు హరిజన్. అయితే, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారిద్దరినీ పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం కొన్ని రోజులు కాపురం బాగానే సాగింది.

తన మీద పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపం, మరే కారణం వల్లో భార్య మీద అతడు కోపం పెంచుకున్నాడు. ఓ రోజు భార్యను తీసుకుని బయటకు వెళ్లాడు. రాత్రి 10 గంటల వరకు చెరువు కట్ట మీదే తిరిగారు. ఆ సమయంలో తన స్నేహితులను పిలిచాడు. తన భార్యను వారితో కలసి చేతులు కట్టేశాడు. ఆమె ముఖానికి ముసుగు తొడిగాడు. తన స్నేహితులు ఆమె మీద అత్యాచారం చేసిన తర్వాత అతడు కూడా ఆమె మీద లైంగికదాడికి పాల్పడ్డాడు. గ్యాంగ్ రేప్ జరిగిన తర్వాత వారంతా ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత రోజు అపస్మారక స్థితి నుంచి బయటపడిన ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు