Home /News /crime /

Crime : భర్తకు ఆ... చిత్రాలు చూసే అలవాటు ఉంది.. భరించలేని భార్య కోర్టును ఆశ్రయించింది..

Crime : భర్తకు ఆ... చిత్రాలు చూసే అలవాటు ఉంది.. భరించలేని భార్య కోర్టును ఆశ్రయించింది..

Crime : భర్తకు ఆ... చిత్రాలు చూసే అలవాటు ఉంది..

Crime : భర్తకు ఆ... చిత్రాలు చూసే అలవాటు ఉంది..

Crime : పెళ్లయిన ఓ వ్యక్తికి నిత్యం బ్లూ ఫిలింస్ చూసే అలవాటు ఉంది. అంతేకాదు.. భార్య ఉండగానే మరో మహిళతో ఫోన్ చాటింగ్‌లు చేస్తూ.. భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు.. భరించలేని భార్య కోర్టును ఆశ్రయించింది.

    పెళ్లి అయిన తర్వాత కొంతమంది మగాళ్లు సైకోలుగా వ్యవహరిస్తారు.. అది ఒక్కోసారి చాలా విషాదంగా కూడా ఉంటుంది. భార్యలు బయటకు చెప్పుకోలేని విధంగా వ్యవహరిస్తారు. దీంతో భర్త పెట్టే చిత్రహింసలను, వేధింపులను బయటకు చెప్పుకోలేని పరిస్థితిని కల్పిస్తారు. దీంతో కొన్ని సంవత్సరాల పాటు అంతర్గతంగా మనోవేదనకు గురైన మహిళలలు చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలా ఓ భర్త చేసిన ఆఘాయిత్యాన్ని రెండు సంవత్సరాలు పాటు భరించిన భార్య ఏకంగా కోర్టును ఆశ్రయించింది.

    వివరాల్లోకి వెళితే.. అశ్లీల చిత్రాలు చూడటానికి అలవాటుపడ్డ భర్త తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, తనను కాపాడాలని ఓ మహిళ కోర్టును ఆశ్రయించిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులోని జయనగర్‌కు చెందిన 36 ఏళ్ల మహిళకు రెండేళ్ల కిందట వివాహమైంది. భారీగా కట్నకానుకలను ఇచ్చి ఆమె తల్లిదండ్రులు అంగరంగవైభవంగా పెళ్లి జరిపించారు. అయితే, అత్తారింట్లోకి అడుగుపెట్టిన తర్వాత తన భర్తకు అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉందని తెలిసింది. అంతేకాదు.. రాత్రుళ్లు వేరే మహిళలతో చాటింగ్‌ చేస్తుండటాన్ని గమనించింది.

    ఇది చదవండి :  ఈ పండగ రోజు డబ్బులు పొగొట్టుకుంటేనే.. లక్ష్మి తిరిగి వస్తుందట.. !


    దీంతో ఈ పనులు మానుకోమని బాధితురాలు ఎంత చెప్పినా భర్త వినకపోగా.. తిరిగి చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టారు. కొట్టడంతోపాటు..ఇంట్లో పాచిపోయిన ఆహారం తినాలని బలవంతం చేసేవారని బాధితురాలు తెలిపింది. అయితే ఈ విషయం భర్త తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లినా అతడికే మద్దతుగా నిలిచారని పేర్కోంది.. మరోవైపు బయట జరిగే కుటుంబ శుభకార్యాలకు తనను తీసుకెళ్లడం మానేశారని ఫిర్యాదులో వాపోయింది. దీంతో నేరుగా పోలీసులను ఆశ్రయించకుండా తనను కాపాడుకునేందుకు ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కోర్టు.. బాధితురాలి ఫిర్యాదుపై దర్యాప్తు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని మహిళా పోలీసులను ఆదేశించింది.

    ఇది చదవండి : ముగ్గురు పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత దారుణానికి పాల్పడ్డాడు.. !

    Published by:yveerash yveerash
    First published:

    Tags: Bengaluru, Crime

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు