Home /News /crime /

HUSBAND HAS LODGED A COMPLAINT WITH THE SUPERINTENDENT OF POLICE AGAINST WIFE PARENTS FOR DRAGGING HIS WIFE OUT OF SIGHT AND DEMANDING THE RELEASE OF HIS LIFE THREATENING WIFE SSR

Love Marriage: ఒకే కంపెనీలో పనిచేసే వీళ్లిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. కానీ.. పాపం..

సెల్వన్, ఇళమతి పెళ్లి ఫొటో

సెల్వన్, ఇళమతి పెళ్లి ఫొటో

ఆ యువతి, యువకుడు మేజర్లు. ప్రేమించుకున్నారు. పెద్దలకు తమ ప్రేమ గురించి చెప్పారు. యువతి తల్లిదండ్రులు సదరు యువకుడితో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో.. చాలామంది ప్రేమికుల్లానే వీళ్లిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయి స్నేహితుల సహకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

ఇంకా చదవండి ...
    ఆ యువతి, యువకుడు మేజర్లు. ప్రేమించుకున్నారు. పెద్దలకు తమ ప్రేమ గురించి చెప్పారు. యువతి తల్లిదండ్రులు సదరు యువకుడితో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో.. చాలామంది ప్రేమికుల్లానే వీళ్లిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయి స్నేహితుల సహకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కలిసి కొత్తగా కాపురం పెట్టుకుని సంతోషంగా ఉంటున్నారు. యువతి కుటుంబం కూడా కొన్నాళ్లు మౌనంగానే ఉండిపోయింది. కానీ.. కొన్ని రోజుల క్రితం ఆ యువతిని బలవంతంగా ఆమె కుటుంబం పుట్టింటికి తీసుకెళ్లింది. తమ కూతురిని కలవాలని చూస్తే చంపేస్తామని ఆ యువకుడిని యువతి కుటుంబం బెదిరించింది. అంతేకాకుండా తన భార్యకు ప్రాణ హాని కూడా ఉందని ఆ యువకుడు ఫిర్యాదు చేశాడు. తన భార్యను బలవంతంగా తీసుకెళ్లారని, ఆమెతో కలిసి బతకాలనుకుంటున్నానని.. ఆమెను, తననూ కలపాలని ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.

    ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన సెల్వన్ అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో ఇళమతి అనే యువతి కూడా పనిచేస్తోంది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లు ఇద్దరూ స్నేహంగా ఉన్నారు. ఆ స్నేహం కాస్తా రోజులు గడిచే కొద్దీ ప్రేమగా మారింది. అయితే.. ఇద్దరి కులాలు వేరు. దీంతో.. రెండు కుటుంబాలు వీరి ప్రేమ బంధాన్ని వ్యతిరేకించాయి. అయితే.. కన్నవాళ్లను కాదనుకుని ఇద్దరూ కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెరియార్ స్టూడియోలో ద్రవిడార్ లిబరేషన్ ఫ్రంట్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అయిన ఈశ్వరన్ సహకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కొన్ని నెలలు సంతోషంగా జీవించారు. అయితే.. వీళ్లు ఎక్కడ కాపురం పెట్టింది తెలుసుకున్న యువతి కుటుంబం ఆ యువకుడిని కొట్టి ఆమెను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనతో తీవ్ర మనోవేదన చెందిన సెల్వన్ తన భార్యను ఇలా తీసుకెళ్లిపోయారని.. తామిద్దరం మేజర్లమని.. ప్రేమ పెళ్లి చేసుకున్నామని పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఈ విషయంలో స్పందించలేదని సెల్వన్ తెలిపాడు.

    ఇది కూడా చదవండి: Wife: మూడో పెళ్లి చేసుకున్న భర్తకు, ఈమెకూ 16 ఏళ్ల ఏజ్ గ్యాప్.. భర్తతో ఇలా కనిపించినా.. చివరికి..

    అప్పటి అన్నాడీఎంకే మంత్రికి, ఆ యువతి కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని బాధిత యువకుడు పేర్కొన్నాడు. తన భార్య నుంచి ఇటీవల సెల్వన్‌కు వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. తనను చంపాలని చూస్తున్నారని, తన లైఫ్ డేంజర్‌లో ఉందని.. వచ్చి కాపాడాలని ఆ యువతి సెల్వన్‌కు వాట్సాప్‌లో మెసేజ్ చేసింది. దీంతో.. ఆ యువకుడు ఈసారి మీడియా ముందుకు వచ్చి మరీ జరిగిన విషయాన్ని వివరించాడు. దీంతో.. పోలీసులు కూడా ఈ కేసులో జోక్యం చేసుకున్నారు. తన భార్యకు ప్రాణ హాని ఉందన్న ఆ యువకుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని.. విచారణ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Husband, Love marriage, Lovers, Tamilnadu, Wife

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు