Wife: మొదటి రాత్రి నుంచే భార్యకు దూరంగా భర్త.. మూడేళ్ల తరువాత బయటపడ్డ సీక్రెట్.. షాకైన భార్య

ప్రతీకాత్మక చిత్రం

లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఉన్న తన భర్త తనను పట్టించుకోకుండా ఫోన్‌లో చాటింగ్ చేయడంపై ఆమెలో అనుమానాలు పెంచేలా చేసింది.

  • Share this:
    పెళ్లి చేసుకున్న భర్త మొదటి రాత్రి నుంచే భార్యతో దూరంగా ఉంటున్నారు. అదేంటని ప్రశ్నిస్తే ఆమెకు ఏదో కారణంగా చెప్పాడు. ఆ తరువాత కూడా ఆమెతో ఆ గ్యాప్ కొనసాగిస్తూ వచ్చాడు. ఆ తరువాత ఈ వివాదాన్ని వరకట్నం వైపు మళ్లించి.. మరికొన్నాళ్లు ఆమెకు దూరంగా ఉన్నాడు. అయితే అసలు తన భర్త తనకు ఎందుకు దూరంగా ఉంటున్నాడనే విషయం మూడేళ్ల తరువాత కానీ అతడి భార్యకు తెలియదు. ఇలాంటి కారణం వల్లే తన భర్త తనకు దూరంగా ఉంటున్నాడని తెలుసుకున్న ఆ మహిళ షాకైంది. వెంటనే విడాకులు ద వ్యక్తం చేసింది. అయితే అదనపు కట్నం తీసుకొస్తేనే నీతో కాపురం చేస్తానంటూ తన భార్యకు చెప్పాడు భర్త. దీంతో కథ మరో మలుపు తిరిగింది.

    అయితే కొన్నాళ్ల తరువాత అతడి ఫోన్ చాటింగ్ చూసిన భార్యకు మైండ్ బ్లాంక్ అయ్యింది. లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఉన్న తన భర్త తనను పట్టించుకోకుండా ఫోన్‌లో చాటింగ్ చేయడంపై ఆమెలో అనుమానాలు పెంచేలా చేసింది. మరో మహిళతో తన భర్తకు సంబంధం ఉందేమో అని భావించింది. అతడికి తెలియకుండా అతడి ఫోన్‌లోని చాట్‌లను పరిశీలించింది. అయితే ఇక్కడే ఆమె ఊహించిన దాని కంటే భిన్నాంగా ఇతర పురుషులతో శృంగారానికి సంబంధించిన చాట్ చేయడం ఆమె అవాక్కయ్యేలా చేసింది.

    అదే సమయంలో కొన్ని గే డేటింగ్ సైట్లను పరిశీలించిన ఆమెకు తన భర్త ప్రొఫైల్ అందులో ఉండటం చూసి షాక్ అయ్యింది. భర్త నుంచి విడిపోయేందుకు సిద్ధపడి విడాకుల కోసం మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. అయితే తన ప్రొఫైల్ గే డేటింగ్ సైట్లలో ఉండటాన్ని అతడు అంగీకరించాడు. దీంతో భర్త నుంచి విడిపోవాలని ఆ మహిళ నిర్ణయించుకుంది. కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
    Published by:Kishore Akkaladevi
    First published: