Home /News /crime /

HUSBAND HARASSMENT WIFE COMMITTED SUICIDE IN KAMAREDDY DISTRICT VB NZB

Telangana: ఆడపిల్లలకు జన్మనివ్వడమే ఆమె చేసిన పాపమా.. భర్త వేధింపులు తట్టకోలేక చివరకు ఆమె.. ఘోర విషాదం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Commit to suicide: పుట్ట‌బోయేది ఆడ‌పిల్లా, మ‌గ పిల్లాడా అనేది తొమ్మ‌ది నెల‌లు క‌డుపులో మోసిన త‌ల్లికి కూడా తెలియదు. ఈ కంప్యూట‌ర్ యుగంలో కూడా ఆడ‌బిడ్డ‌ల‌కు జ‌న్మ‌నించావ‌ని భార్యను వేధించాడు ఓ భర్త. చివరకు ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

ఇంకా చదవండి ...
  డిజిట‌ల్ కాలంలో ఆడ‌పిల్ల, మ‌గ పిల్లాడు అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో మ‌హిళ‌లు వారి ప్ర‌తిభ చూపుతున్నారు. అబ్బాయిలకు సాధ్యం కాని ఎన్నో విజ‌యాల‌ను అమ్మాయిలు అందుకున్నారు. ప్ర‌తి విష‌యంలో వారి స‌త్తా చాటుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఆడ‌బిడ్డ‌లు పుట్టార‌ని ఓ భ‌ర్త భార్య‌ను వేధించాడు. దీంతో ఆ భార్య మ‌న‌స్తాపానికి గురై త‌నువు చాలించింది. ఈ ఘ‌ట‌న కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండ‌లం పుల్కంపేట్ గ్రామానికి చెందిన వడ్ల నాగమణి, సంజీవులు 12 యేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్ద‌రు ఆడపిల్లలు. పెద్ద‌మ్మాయి భవిత(11), చిన్న‌మ్మాయి లాస్య యేడాదిన్న‌ర‌ ఉన్నారు. సంజీవులు బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి ఈ మ‌ధ్య తిరిగి వచ్చాడు. గల్ఫ్ దేశం నుంచి వచ్చిన నాటి నుంచి ఆడపిల్లలు పుట్టారని సంజీవులు నాగమణి రోజు వేధిస్తున్నాడు. దీంతో నాగ‌మ‌ణి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు వచ్చి చాలా సార్లు నచ్చజెప్పారు. అయినా అతనిలో మార్పు రాలేదు. అంతే కాకుండా నాగమణి తల్లిదండ్రులను ఇంటికి రానిచ్చేవాడు కాదు. ఫోన్ లో కూడా మాట్లాడవద్దని బెదిరించేవాడు.

  అయితే ఇటీవల నాగమణి తన తల్లి తో ఫోన్లో మాట్లాడింది. మీ అమ్మ‌కు ఎందుకు ఫోన్ చేసావ్ అని సంజీవులు ఆమెతో గొడవ పడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన నాగమణి ఆరోజు రాత్రి అందరు పడుకున్నాక ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తెల్లారి ఉదయం గ్రామ శివారు లోని వాగు లోని నీటి మడుగులో శ‌వ‌మై కనిపించింది. ఆడపిల్లలు పుట్టారని మా అల్లుడు వేధించ‌డం వ‌ల్ల‌నే నా కూతురు ఆత్మహత్య చేసుకుందని నాగమణి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతురాలి త‌ల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  ఆడ‌వారు లేనిదే సృష్టి లేదు.. అనే మాటాలు చేప్ప‌డం వ‌ర‌కే.. ఆచార‌ణ‌లో మాత్రం ఆడ‌పిల్ల వ‌ద్దు.. మ‌గ‌పిల్ల‌డే ముద్దు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎంత సాధించినా.. ఎంత ఎదిగినా.. ఆడ‌పిల్ల ఆడ‌పిల్లే అనే ధోరణి మార‌నంత వ‌ర‌కు ఈ తేడా ఇలాగే ఉంటుంది. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవితో పోల్చే మన దేశంలో పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే ఉసురుతీస్తున్న ఘటనలు అత్యంత బాధాకరం. ఆడపిల్లలపై వివక్షను రూపుమాపేందుకు, పురుషులతో సమానంగా మహిళలు హక్కులు పొందేందుకు అనువైన వాతావరణం ఉండాలి. కొడుకు వంశోద్ధారకుడు, తలకొరివి పెట్టి పున్నామనరకం నుంచి తప్పిస్తాడు వంటి పాతుకుపోయిన పితృస్వామ్య భావజాలమే బాలికల మనుగడకు అవరోధాలవుతున్నాయి. బాధ్యత గల పౌర సమాజం బాలికలకు రక్షణ దడిగా నిలవాలి. అందుకే ఆడ పిల్లలకు సంబంధించి మరిన్ని చట్టాలు, పథకాలు లాంటివి కల్పిస్తే.. ఇలాంటి వేధించే మృగాళ్లు మారతారేమో.
  Published by:Veera Babu
  First published:

  Tags: Crime, Crime news, Harassment, Husband harassment, Kamareddy, Suicide, Telangana, TS Police

  తదుపరి వార్తలు