HOME »NEWS »CRIME »husband harassing wife for dowry and forcing her to take up prostitution in nagpur hsn

వీడసలు భర్తేనా..? కట్నం డబ్బులు ఇవ్వలేదని భార్యను నీచంగా చిత్రీకరించి.. వేశ్యగా..

వీడసలు భర్తేనా..? కట్నం డబ్బులు ఇవ్వలేదని భార్యను నీచంగా చిత్రీకరించి.. వేశ్యగా..
ప్రతీకాత్మక చిత్రం

పంచాయతీ పెట్టించి పెద్దమనుషుల వద్ద రచ్చ చేసి ఎలాగోలా కట్నాన్ని దక్కించుకున్న వాళ్లను కూడా ప్రత్యక్ష్యంగా చూసి ఉంటారు. అదనపు కట్నం కోసం ఇదే బాటను నమ్ముకున్న వారి గురించి కథలు కథలుగా విని ఉంటారు.. కానీ..

  • Share this:
    కట్నం ఇవ్వకపోతే భార్యలను వేధించిన వాళ్ల గురించి విని ఉంటారు. పుట్టింటికి పంపించి ఎలాగోలా తన పంతాన్ని నెగ్గించుకున్న వారి గురించి చదివి ఉంటారు.పంచాయతీ పెట్టించి పెద్దమనుషుల వద్ద రచ్చ చేసి ఎలాగోలా కట్నాన్ని దక్కించుకున్న వాళ్లను కూడా ప్రత్యక్ష్యంగా చూసి ఉంటారు. అదనపు కట్నం కోసం ఇదే బాటను నమ్ముకున్న వారి గురించి కథలు కథలుగా విని ఉంటారు. కానీ ఓ ప్రబుద్ధుడు విభిన్న బాట పట్టాడు. తన భార్యనే ఏకంగా అమ్మకానికి పెట్టాడు. వేశ్యగా మార్చేందుకు యత్నించాడు. విటులకు ఫోన్ చేసి రప్పించి తన భార్యను వారి వద్దకు పంపించాలనుకున్నాడు. భార్య రివర్స్ కావడంతో అతడి బండారం బయటపడింది. చివరకు పోలీసులు అతడిని తమదైన స్టైల్లో విచారించి కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఓ వ్యక్తికి కొన్నాళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లి సమయంలో అనుకున్న విధంగా అత్తమామలు కట్నాన్ని పూర్తిగా ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత పెద్దమనుషుల్లో పంచాయతీ పెడితే నెలకు పది వేల రూపాయలను ఇచ్చేట్టుగా ఒప్పుకున్నారు. వాటిని కూడా పేదరికం కారణంగా పంపించలేకపోవడంతో ఆ భర్త తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. నెల నెలా పది వేల రూపాయలను నువ్వే ఎలాగోలా ఇవ్వాలని భార్యను వేధించాడు. చిత్రహింసలు పెట్టాడు. ఆ తర్వాత తన నీచ బుద్ధిని కార్యరూపంలోకి తెచ్చాడు.



    భార్య ఫొటోలను మార్ఫింగ్ చేసి వేరొక వ్యక్తితో సన్నిహితంగా ఉన్నట్టు సృష్టించాడు. వాటిని చూపించి ఆమెను బెదిరించాడు. అదే సమయంలో ఆమెకు సంబంధించిన వివరాలను నెట్టింట పెట్టి విటులను ఆకర్షించాడు. కట్నం బాధలు తప్పాలంటే తానుచెప్పినట్టు వినాలని బెదిరించాడు. వేశ్యగా మారాలనీ, తాను చెప్పిన వారి వద్దకు వెళ్లి గడపాలని ఒత్తిడి తెచ్చాడు. తాను ఆ పనిని చేయలేనని భార్య తేల్చిచెప్పడంతో ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. అతడి బాధలను తట్టుకోలేక ఆ భార్య స్థానికంగా ఉన్న ఘట్టికందన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. కట్నం కోసం భార్యను ఏకంగా వేశ్యగా మార్చేందుకు యత్నించాడని తెలియడంతో ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
    Published by:Hasaan Kandula
    First published:January 21, 2021, 14:03 IST