అక్రమ సంబంధాలు పెట్టుకోలేదని భార్యకు తలాక్ చెప్పిన భర్త

తన భర్త ఎప్పుడూ తనను వేరొకరితో లైంగిక సంబంధాలు పెట్టుకోమని బలవంతం పెడుతూ ఉంటారని, అలా చేయనందుకు తనను హింసిస్తాడని ఆరోపించింది.

news18-telugu
Updated: September 4, 2019, 9:04 PM IST
అక్రమ సంబంధాలు పెట్టుకోలేదని భార్యకు తలాక్ చెప్పిన భర్త
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇదో విచిత్ర ఘటన. తన భార్య ఎవరితోనూ వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం లేదన్న కోపంతో ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు ఓ భర్త. ఇది ఎవరో చెప్పిన విషయం కాదు. స్వయానా బాధితురాలు పోలీసులకు చెప్పిన విషయం. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మీరట్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేసింది. తన భర్త, అత్తమామలు తనను కట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపించింది. అదనపు కట్నం తీసుకురాలేదన్న కోపంతో అత్తింటివారు తన మీద దాడి చేశారని తన ఫిర్యాదులో పేర్కొంది. అత్తింటివారి కంటే తన భర్త మీద తీవ్ర ఆరోపణలు చేసింది. తన భర్త ఎప్పుడూ తనను వేరొకరితో లైంగిక సంబంధాలు పెట్టుకోమని బలవంతం పెడుతూ ఉంటారని, అలా చేయనందుకు తనను హింసిస్తాడని ఆరోపించింది. తన భర్త చెప్పినట్టు చేయనందుకు తీవ్రంగా కొట్టాడని, అందుకని తాను పుట్టింటికి వెళ్లిపోవడంతో అక్కడకు వచ్చి తనకు తలాక్ చెప్పాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది.

First published: September 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు