పేకాట మోజులో పడి...కట్టుకున్న భార్యను స్నేహితులకు తాకట్టు పెట్టిన భర్త...

తన భర్త కూడా స్నేహితులను ఇంటికి పిలిచి మద్యం సేవించేవాడని, అలాగే తన స్నేహితుల లైంగిక వాంఛలను తీర్చాలని హింసించేవాడని ఫిర్యాదులో తెలిపింది.

news18-telugu
Updated: October 22, 2019, 10:07 PM IST
పేకాట మోజులో పడి...కట్టుకున్న భార్యను స్నేహితులకు తాకట్టు పెట్టిన భర్త...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
యూపీలోని నోయిడాలో ఓ వ్యక్తి పేకాట మోజులో పడి స్వంత భార్యనే పణంగా పెట్టాడు. స్నేహితులతో పేకాట ఆడుతూ డబ్బు మొత్తం పోగొట్టుకొని చివరకు భార్య శీలాన్ని వారికి తాకట్టు పెట్టాడు. వివరాల్లోకి వెళితే బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం....చెడు వ్యసనాలకు బానిసైన తనభర్త ముగ్గురు స్నేహితులతో పేకాట ఆడాడని, అతని దగ్గర డబ్బులు అయిపోవడంతో, తనను పణంగా పెట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తన భర్త స్నేహితులు లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపించింది. అలాగే తన భర్త కూడా స్నేహితులను ఇంటికి పిలిచి మద్యం సేవించేవాడని, అలాగే తన స్నేహితుల లైంగిక వాంఛలను తీర్చాలని హింసించేవాడని ఫిర్యాదులో తెలిపింది. దీంతో బాధిత మహిళ ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు