హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఏంటీ దారుణం.. ఇంటి అద్దె మాఫీ కోసం ఓనర్‌తో ఎఫైర్ పెట్టుకోమంటాడా? ఏమనాలి ఈ భర్తని?

ఏంటీ దారుణం.. ఇంటి అద్దె మాఫీ కోసం ఓనర్‌తో ఎఫైర్ పెట్టుకోమంటాడా? ఏమనాలి ఈ భర్తని?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉత్తర్ ప్రదేశ్‌లోని (Uttarpradesh) మీరట్ (Meerut) జిల్లాలో ఈ ఘటన జరిగింది. మద్యం, మత్తుకు (Drugs addict) బానిసగా మారిన భర్త కనీసం అద్దె డబ్బులు కూడా సంపాదించలేని స్థితికి వచ్చాడు. చివరకు ఆమె ఎఫైర్ పెట్టుకోనని తెగేసి చెప్పడంతో ఆమెను చితకబాదాడు.

ఇంకా చదవండి ...

సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలను చూస్తుంటే భార్యాభర్తల సంబంధాలు ఇంతలా దిగజారిపోతున్నాయా? భార్యను జీవితాంతం కాపాడాల్సిన భర్త ఇంతలా దిగజారిపోతున్నారా? అనిపిస్తుంటుంది. అదే సమయంలో కొందరు భార్యలు చేసే నిర్వాకం చూస్తే కూడా మరీ ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తున్నారనే భావన కూడా సగటు జనంలో కలుగుతూ ఉంటుంది. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంటి అద్దె మాఫీ కోసం తన భార్యను ఇంటి ఓనర్‌తో ఎఫైర్ (Illegal relationship with owner) పెట్టుకోవాలని ఒత్తిడి తెచ్చాడు ఓ ప్రబుద్ధుడు. కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేని, కట్టని ఆ భర్త తన భార్య మీద పదే పదే ఒత్తిడి తెచ్చాడు. ఇంటి ఓనర్‌తో ఎఫైర్ పెట్టుకుంటే ఇక నెల నెలా అద్దె డబ్బులు కట్టాల్సిన పనిలేదని ప్రెజర్ చేశాడు.

ఉత్తర్ ప్రదేశ్‌లోని (Uttarpradesh) మీరట్ (Meerut) జిల్లాలో ఈ ఘటన జరిగింది. మద్యం, మత్తుకు (Drugs addict) బానిసగా మారిన భర్త కనీసం అద్దె డబ్బులు కూడా సంపాదించలేని స్థితికి వచ్చాడు. చివరకు ఆమె ఎఫైర్ పెట్టుకోనని తెగేసి చెప్పడంతో ఆమెను చితకబాదాడు. అయినా ఆమె ససేమిరా అంది. దీంతో బాధితురాలని కొట్టి ఆమెకు ట్రిపుల్ తలాక్ అని చెప్పేసి వెళ్లిపోయాడు. పోతూపోతూ ఇంట్లో ఉన్న చిన్నా, చితకా విలువైన వస్తువులను కూడా పట్టుకుపోయాడు.

Hyderabad : హుస్సేన్‌సాగర్‌లోకి ఎగిరిపడ్డ కారు.. కొత్త కారులో టిఫిన్ చేయడానికి వెళుతూ..దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన భర్త చేసిన పని, అందుకు తాను నిరాకరించినందుకు తనకు తలాక్ చెప్పాడని తెలియడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఆమె తన భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడి ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

 మరో ఘటనలో ఇంకోలా..

ఇదిలా ఉంటే మరో ఘటనలో ఓ మహిళ ఓ కుర్రాడితో ఎఫైర్ పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని గుంటూరు జిల్లాకు (Guntur District) చెందిన నూటి కోటీశ్వరి అనే మహిళకు.. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన అఖిల్ కు దాదాపు మూడు నెలల క్రితం షేర్ చాట్ యాప్ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకొని తరచూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో కోటీశ్వరి తనకు డబ్బులు అవసరముందని సర్దుబాటు చేయమని అఖిల్ ను కోరింది. దీంతో అతడు ఒకసారి రూ.35 వేలు, మరోసారి రూ.44 వేలు ఆమెకు ఇచ్చాడు.

Cheating: ఈ చెంబు మీ ఇంట్లో ఉంటే దరిద్రం పరార్... యూట్యూబ్ లో చూసి ఏం స్కెచ్ వేశాడు..!ఐతే ఆ డబ్బును అఖిల్ కుటుంబ సభ్యులు వ్యవసాయ ఖర్చు నిమిత్తం అప్పుగా తీసుకొచ్చారు. దీంతో ఆ డబ్బు కోసం తల్లిదండ్రులు అతడ్ని నిలదీశారు. తల్లిదండ్రుల ఒత్తిడితో అఖిల్.. తన డబ్బు తిరిగివ్వాలని కోటేశ్వరిని నిలదీశాడు. ఈ క్రమంలో ఆమె ఈనెల 19న గుంటూరు వస్తే డబ్బులు తిరిగిస్తానని చెప్పింది. దీంతో అఖిల్ గుంటూరులో కోటేశ్వరి ఇంటికి వచ్చాడు. తన దగ్గరున్న నగలను తీసుకున్న కోటేశ్వరి మధ్యాహ్నం అఖిల్ తో కలిసి బంగారు దుకాణం వద్దకు వెళ్లి వాటిని రిపేర్ చేయమని అడిగింది. అందుకు రూ.50వేలు కావాలని అఖిల్ ను కోరింది. అందుకు నిరాకరించిన అఖిల్.. తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని నిలదీశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చేశారు.

shocking : మలద్వారం గుండా గాలిని పంప్ చేశారు -ఫ్యాక్టరీలో సరదాగా చేసిన పని చివరికిలా..అనంతరం డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోటేశ్వరిపై ఆగ్రహంతో ఊగిపోయిన అఖిల్ ఆమె ముఖంపై దిండును అదిమిపెట్టాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరగ్గా ఆమె కిందపడిపోయింది. అనంతరం కోటేశ్వరి జుట్టుపట్టుకొని బలంగా నేలకేసి కొట్టాడు. చనిపోలేదన్న అనుమానంతో గొంతునలిమి హత్య చేశాడు.

First published:

Tags: Illegal affair, Uttarpradesh

ఉత్తమ కథలు