స్నేహితుడు, సోదరుల లైంగిక వాంఛ తీర్చమని భార్యను చితకబాది...

ఈ క్రమంలోనే తన సోదరులు, స్నేహితులతో శృంగారంలో పాల్గొనాలని నిందితుడు పట్టుబట్టేవాడు. అందుకు మహిళ ససేమిరా అనడంతో ఆమెను చితకబాదేవాడు.

news18-telugu
Updated: September 16, 2019, 5:46 PM IST
స్నేహితుడు, సోదరుల లైంగిక వాంఛ తీర్చమని భార్యను చితకబాది...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కట్టుకున్న భార్యను స్నేహితులు, సోదరుల లైంగిక వాంఛ తీర్చమని పట్టుబట్టి కటకటాల పాలయ్యాడో ప్రబుద్ధుడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌కు చెందిన నిందితుడు తన భార్యతో కలిసి జనక్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. వృత్తి రీత్యా డెంటిస్టు అయిన నిందితుడు తన భార్యను నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. ఆమెను శారీరకంగానూ వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలోనే తన సోదరులు, స్నేహితులతో శృంగారంలో పాల్గొనాలని నిందితుడు పట్టుబట్టేవాడు. అందుకు మహిళ ససేమిరా అనడంతో ఆమెను చితకబాదేవాడు. తాజాగా మద్య సేవించి తన స్నేహితుడుతో కలిసి శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడు. దీంతో మహిళ భయభ్రాంతులకు గురై బెడ్రూంలోకి వెళ్లి గడియవేసుకుంది.

దీంతో ఆగ్రహానికి గురైన ఆమె భర్త, తన స్నేహితుడితో కలిసి బలమంతా ఉపయోగించి తలుపు గడియ విరగొట్టి లోపలకు వచ్చారు. అనంతరం ఆమెపై లైంగికదాడికి పాల్పడేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే మహిళ అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
First published: September 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading