Home /News /crime /

Wife: అప్పటివరకు భార్యతో ప్రేమగా ఉన్న భర్త.. కాసేపటికే ఊహించనిఘోరం.. చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూస్తే..

Wife: అప్పటివరకు భార్యతో ప్రేమగా ఉన్న భర్త.. కాసేపటికే ఊహించనిఘోరం.. చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూస్తే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లాలో నివాసం ఉంటున్న యశ్వంత్ టాండన్ భార్యతో ప్రేమగా ఉంటున్నట్టు నటిస్తున్నాడు. తనపై భార్యకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండేలా చేసుకున్నాడు.

  కట్టుకున్న భార్యను వేధించేందుకు కొందరు మగాళ్లు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. తమలోని శాడిజాన్ని విభిన్నంగా ప్రదర్శిస్తున్నారు. ఆ క్రమంలో మహిళలను, కట్టుకున్న భార్యను వేధిస్తున్నారు. తమకు అడ్డుగా ఉందనుకున్న భార్య అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లాలో నివాసం ఉంటున్న యశ్వంత్ టాండన్ భార్యతో ప్రేమగా ఉంటున్నట్టు నటిస్తున్నాడు. తనపై భార్యకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండేలా చేసుకున్నాడు. అయితే ఉన్నట్టుండి అతడి భార్య పరుగుల మందు తాగడం ఆ ప్రాంతంలో కలకలం రేగింది. చుట్టుపక్కల ఉన్న వాళ్లు రావడంతో.. యశ్వంత్ టాండన్ ఉమను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతోంది.

  ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. అయితే నిందితుడిని విచారించిన పోలీసులు.. అతడు చెప్పిన వివరాలను వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఉన్న తన భార్య ఉమతో మాట్లాడిన యశ్వంత్ టాండన్.. తనపై భార్యకు ఎంత ప్రేమ ఉందని ప్రశ్నించాడు. ఇందుకు ఆమె ఎంతో ప్రేమ ఉందని సమాధానం చెప్పింది. ఎలా నిరూపిస్తావని భర్త అడగటంతో.. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. అయితే భర్త ఈ రకమైన వాదన వినిపించగా.. చుట్టుపక్కల వారి వాదన మాత్రం మరోలా ఉంది.

  Telangana: ఢిల్లీ నుంచి వచ్చి సైలెంట్ అయిన KCR.. కొత్త ప్లాన్‌.. ఆ తరువాతే అమలు చేస్తారా ?

  KCRను మళ్లీ టెన్షన్ పెడుతున్న ఈటల రాజేందర్.. అజ్ఞాతంలోకి ఆ నాయకుడు ?

  Salt: మీరు వాడే ఉప్పు మంచిదేనా ? ఇలా చెక్ చేసుకోండి.. చాలా ముఖ్యం

  Health Tips: మీరు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారా ? వెంటనే ఈ కూరగాయలకు దూరంగా ఉండండి

  తాము యశ్వంత్ ఇంటికి వెళ్లే సరికి.. ఉమ పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని.. ఆమె భర్త యశ్వంత్ టాండన్ బలవంతంగా ఆమెకు పురుగుల మందు తాగించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు నిందితుడైన భర్తపై సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం యశ్వంత్ పోలీసుల అదుపులో ఉన్నాడు. బాధితురాలి భర్త తీరు అనుమానాస్పదంగా ఉందని భావిస్తున్న పోలీసులు.. అతడి ట్రాక్ రికార్డ్ ఏ రకంగా ఉందనే దానిపై విచారణ చేపట్టారు. అయితే అతడి భార్య ఉమ తనకు తానుగానే పురుగుల మందు తాగిందా లేక నిందితుడు ఆమెకు బలవంతంగా పరుగుల మందు తాగించాడా ? అనే అంశంపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Crime news, Wife

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు