పెళ్లయిన మరుసటి రోజే భార్యకు ఆ పరీక్షలు...విడాకులు కోరిన నవవధువు

నమూనా చిత్రం

అయితే పెళ్లైన మరుసటి రోజు... అమ్మాయి గ్రాస్ట్రిక్ సమస్యతో వాంతులు చేసుకుంది. దీంతో భార్యపై శరత్ అభిమానం మరింత ముదిరింది.

 • Share this:
  వాళ్లిద్దరు ఎంబీయే చదువుకున్నారు. మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. కర్ణాటకకు చెందిన శరత్ అనే అబ్బాయి, యువతి మ్యాట్రిమనీ ద్వారా ఒకరికి ఒకరు పరిచయమయ్యారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఇంతలో పెళ్లి మరో 15 రోజుల్లో ఉందనగా.. అమ్మాయి తల్లి అకస్మాత్తుగా చనిపోయింది. దీంతో పెళ్లికూతురు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. అప్పట్నుంచి సరిగా మాట్లాడకపోవడం ముభావంగా ఉండటంతో... శరత్ అమ్మాయిని అపార్థం చేసుకున్నాడు. అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదోమోనన్న అనుమానం అతనిలో కలిగింది. ఎలాగోలా ఇద్దరి పెళ్లి జరిగిపోయింది. అయితే పెళ్లైన మరుసటి రోజు... అమ్మాయి గ్రాస్ట్రిక్ సమస్యతో వాంతులు చేసుకుంది. దీంతో భార్యపై శరత్ అభిమానం మరింత ముదిరింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఏదో టెస్టులంటూ పేపర్లపై సంతకాలు పెట్టించుకున్నాడు. పేపర్లపై ఉన్న విషయం చదవకుండానే గుడ్డిగా సంతకం పెట్టేసింది భార్య. డాక్టర్లు వచ్చి పరీక్షలు చేయగానే.. ఆమెకు అసలు విషయం తెలిసింది. తన భర్త తనకు తెలియకుండా కన్యత్వ, గర్భదారణ పరీక్షలు నిర్వహిస్తున్నాడని తెలిసి షాక్‌కు గురైంది.

  భర్త చేసిన నిర్వాకంతో నిర్ఘాంతపోయిన నవవధువు అతడికి దూరంగా తన సోదరి ఇంట్లోనే ఉంది. మూడు నెలల తర్వాత విడాకులు కోరింది.అనుమానపు భర్త తనకు వద్దని తేల్చి చెప్పి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే పెళ్లి కావడంతో.. ఇద్దర్ని పోలీసులు ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు పంపించారు. కౌన్సిలింగ్ సెంటర్లో భర్త చేసిన అరాచకల్ని బాధితురాలు చెప్పడంతో కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్లు సైతం షాక్ తిన్నారు. దీంతో అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో... బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. తనను అనుమానిస్తూ, వేధించే భర్త తనకు వద్దని తేల్చిచెప్పేసింది.

   

   
  First published: