వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని నెలలు గడిచాక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భర్తతో కలిసి జీవించేందుకు భార్య నిరాకరించింది. అయితే ఆమె ఎందుకు ఇలా చేస్తుందని తెలుసుకోవడానికి ప్రయత్నించిన భర్తకు షాకింగ్ విషయం తెలిసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. కాన్పూర్‌లోని బాబుపూర్వకు చెందిన అమిత్ శర్మ, గోవింద్ నగర్లో నివాసం ఉంటున్న రుచి వర్మ ప్రేమించుకున్నారు. వీరిద్దరు గతేడాది జూన్ 4వ తేదీన ఆర్య సమాజ్‌లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కరోనా సమయం కావడంతో వీరి పెళ్లికి కొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబంధించి మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఉందని అమిత్ తెలిపాడు. వివాహం తర్వాత వీరిద్దరు సంతోషంగా జీవనం సాగించారు. అయితే పెళ్లి జరిగిన నాలుగు నెలలకు రుచి తల్లి ఆమె ఇంటికి వచ్చింది. బంధువులలో ఒకరి వివాహం ఉందని.. అందుకోసం కూతురుని తనతో రావాల్సిందిగా కోరింది.
ఆ సమయంలో రుచి.. ఆమెతో పాటు రూ. 50 వేలు, కొన్ని నగలు కూడా తీసుకుని వెళ్లింది. ఇక, కొద్ది రోజుల తర్వాత రుచికి ఆమె భర్త ఫోన్ చేశాడు. అయితే ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అతడు తన భార్యను తీసుకురావడానికి నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే అతనితో వచ్చేందుకు ఆమె నిరాకరించింది. ఈ క్రమంలోనే అమిత్.. ఏదో జరిగిందని అనుమానించాడు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టగా.. అతనికి షాకింగ్ విషయం తెలిసింది. తనతో విడాకులు తీసుకోకుండానే రుచి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టుగా తేలింది. అయితే దీనిని పూర్తిగా నమ్మని అమిత్.. రతన్‌లాల్ నగర్‌లోని ఆర్య సమాజ్‌కు వెళ్లాడు. అక్కడ తన భార్య రెండో వివాహానికి సంబంధించిన వీడియోని చూశాడు. దీంతో పూర్తిగా షాక్‌లోకి వెళ్లిపోయాడు.
ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2021 జూలై 2 న తన భార్య మరొక వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు పోలీసులకు చెప్పాడు. అతడిని భార్య, ఆమె కుటుంబ సభ్యులు బెదిరించాడని తెలిపాడు. ఇప్పటివరకు తన భార్యకు మూడు సార్లు వివాహం జరిగిందని చెప్పాడు. తనకు రక్షణ కల్పించాలని పోలీసుల సహాయం కోరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.