కోడలిపై మామ కిరాతకం...బాత్రూంలో స్నానం చేస్తుంటే దూరి..దారుణం

వ్యాపార పనుల నిమిత్తం పెద్ద కుమారుడు పలు ప్రాంతాలకు తిరుగుతూ ఉండేవాడు. కోడలిపై మామ కన్నేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో కోడలు బాత్రూమ్‌లో స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్‌లో జొరబడి ఆమెపై అత్యాచారం చేశాడు.

news18-telugu
Updated: October 20, 2020, 11:54 PM IST
కోడలిపై మామ కిరాతకం...బాత్రూంలో స్నానం చేస్తుంటే దూరి..దారుణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇంట్లో ఎవరులేని సమయంలో బాత్రూమ్‌లో స్నానం చేస్తున్న కోడలిపై మామ అత్యాచారం చేసి లైంగికంగా వేధిస్తున్న సంఘటన బీహార్‌లోని లఖీసరాయ్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రవి అనే వ్యక్తి (పేరుమార్చబడింది) స్వీట్ షాప్ నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రవి భార్య పది సంవత్సరాల క్రితం చనిపోవడంతో ఇద్దరు కుమారులతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. చిన్న కుమారుడు కోల్‌కతాలో జాబ్ చేస్తుండగా పెద్ద కుమారుడి ఈ మధ్యలోనే వివాహం చేశాడు. వ్యాపార పనుల నిమిత్తం పెద్ద కుమారుడు పలు ప్రాంతాలకు తిరుగుతూ ఉండేవాడు. కోడలిపై మామ కన్నేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో కోడలు బాత్రూమ్‌లో స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్‌లో జొరబడి ఆమెపై అత్యాచారం చేశాడు.

అలా పలుమార్లు ఆమెపై అఘాయిత్యం చేయడంతో తట్టుకోలేక తన కుటుంబ సభ్యులకు సమస్యను వివరించింది. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Published by: Krishna Adithya
First published: October 20, 2020, 11:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading