HUSBAND DOUBT ON WIFE CHARACTER ASKS FOR FIDELITY TEST LEADS TO ALUMINUM THREAD IN HER GENITALS HSN
భార్య క్యారెక్టర్ పై భర్తకు అనుమానం.. శీల పరీక్ష చేస్తానంటూ ఆమె కాళ్లూ చేతులు కట్టేసి మరీ దారుణం..!
ప్రతీకాత్మక చిత్రం
ఆ భర్తకు భార్యపై అనుమానం కలిగింది. వేరొకరితో అక్రమ సంబంధం నడుపుతోందేమో అన్న అనుమానం అతడికి కలిగింది. అంతే, తన భార్యతో గొడవ పెట్టుకున్నాడు. శీలపరీక్ష చేస్తానంటూ..
భార్యపై అనుమానం. అతడిని దారుణమైన పనికి పూనుకునేలా చేసింది. ‘నువ్వు వేరొకరితో అక్రమ సంబంధాన్ని నడుపుతున్నావ్. నాకు నీపై అనుమానం ఉంది. నా అనుమానం తీరాలంటే నిన్ను నువ్వే నిరూపించుకో. నాకు సహకరిస్తే ఓ పరీక్ష నేను చేస్తా. ఆ పరీక్షలో కనుక నువ్వు నెగ్గితే నా అనుమానం తీరిపోతుంది‘ అంటూ భార్యతో పిచ్చి కూతలు కూశాడు. ఆపై ఆమెను తిట్టి, కొట్టి తాళ్లతో కాళ్లూ చేతులు కట్టేశాడు. చివరకు ఓ ఇనుపరాడ్డును తీసుకుని ఆమె మర్మాంగాల్లో దూర్చాడు. తీవ్ర రక్తస్రావం కావడంతోపాటు ఆమె అరుపులు, పెడబొబ్బలు వేస్తుండటంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ పరిధిలోని మాలిక్ ప్రాంతంలో ఓ వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడికి తన భార్యపై అనుమానం కలిగింది. ఆమె వేరెవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని అతడు ఆమెతో గొడవపడసాగాడు. ఇద్దరి మధ్య తరచూ ఇదే విషయమై వాదులాట జరిగేది. ‘నాకు నీపై అనుమానం ఉంది. నా అనుమానాన్ని తీర్చాల్సింది నువ్వే. నేనే నీకు శీల పరిక్ష చేస్తా‘ అంటూ భార్యతో నానా మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత భార్యను కొట్టాడు.
ఆమె కాళ్లూ, చేతులను తాళ్లతో కట్టేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ఓ ఇనుప రాడ్డును తీసుకుని ఆమె మర్మాంగాల్లోకి దూర్చాడు. బాధను భరించలేక ఆమె పెద్దగా కేకలు పెట్టింది. తీవ్ర రక్తస్రావం జరగడంతో అతడు భయపడిపోయి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఘటన జరిగిన స్థలానికి వచ్చి ఆమె పరిస్థితిని చూసి, ఆమె తల్లికి సమాచారం అందించారు. ఈ లోపే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రాంపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉందని తెలిపారు. పరారీలో ఉన్న ఆమె భర్తను అరెస్ట్ చేశామని వెల్లడించారు. బాధితురాలికి మెరుగైన వైద్యాన్ని అందిస్తామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.