HUSBAND DIED ON ROAD ACCIDENT AND WIFE COMMITS SUICIDE IN TAMILNADU SSR
Accident: యాక్సిడెంట్ అంటే ఒక కుటుంబం రోడ్డు మీద పడిపోవడం.. తమిళనాడులో విషాద ఘటన
ప్రతీకాత్మక చిత్రం
అంబత్తూరు పారిశ్రామికవాడలోని ఓ సంస్థలో మనోజ్ పనిచేసేవాడు. మార్చిలో రోజూలానే ఉద్యోగానికి వెళ్లిన మనోజ్‌కుమార్‌ను మృత్యువు రోడ్డు ప్రమాదంలో రూపంలో వెంటాడింది. పని ముగించుకుని తిరిగి వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో మనోజ్ ప్రాణాలు కోల్పోయాడు. భర్త మరణం నిదను తీవ్ర మనోవేదనకు...
చెన్నై: రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం ఆ వివాహితను కుంగదీసింది. తాను ఎంతగానో ప్రేమించే మనిషి ఇక లేడనే నిజాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది. భర్త లేని జీవితం దుర్భరమని భావించిన ఆ వివాహిత కన్న బిడ్డలకు విషమిచ్చి.. తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడులోని తాంబరం సమీపంలోని సేలయూరులో ఈ ఘటన వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాంబరం సమీపంలోని సేలయూరుకు చెందిన నిద(34), మనోజ్‌కుమార్(38) పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు, పాప పుట్టారు. బాబు పేరు యోగేష్(9), పాప పేరు కనిష్క(6). ఈ దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భార్యాభర్తలు పిల్లలిద్దరినీ కంటికి రెప్పలా చూసుకుంటూ సంతోషంగా ఉండేవారు. అంబత్తూరు పారిశ్రామికవాడలోని ఓ సంస్థలో మనోజ్ పనిచేసేవాడు. మార్చిలో రోజూలానే ఉద్యోగానికి వెళ్లిన మనోజ్‌కుమార్‌ను మృత్యువు రోడ్డు ప్రమాదంలో రూపంలో వెంటాడింది. పని ముగించుకుని తిరిగి వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో మనోజ్ ప్రాణాలు కోల్పోయాడు. భర్త మరణం నిదను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న మనోజ్ ఇక లేడన్న వార్త ఆమెను కలచివేసింది. భర్త లేని జీవితం తనకు వద్దని భావించి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అన్నంలో విషం కలుపుకుని తాను తిని, ఇద్దరు పిల్లలకు పెట్టింది. అయితే.. ఆ ఆహారం తిన్న యోగేష్ కడుపులో మంటగా ఉందని తల్లికి చెప్పేందుకు ప్రయత్నించాడు.
అయితే.. విషాహారం తిన్న నిద అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో.. భయంతో యోగేష్ తాత వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. వెంటనే యోగేష్ తాతయ్య అక్కడికి వెళ్లి చూడగా.. నిద, కనిష్క అపస్మారక స్థితిలో ఉన్నారు. ముగ్గురినీ చికిత్స నిమిత్తం క్రోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిద చనిపోయింది.
విషాహారం తక్కువ తినడంతో పిల్లలిద్దరికీ ప్రాణాపాయం తప్పింది. మెరుగైన వైద్యం కోసం పిల్లలిద్దరినీ ఎగ్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల మరణంతో పిల్లలు అనాథలయ్యారు. వాళ్ల తాతయ్యకు వయసు మళ్లడంతో ప్రస్తుతానికి బంధువులే పిల్లలను ఆసుపత్రికి తరలించి.. వాళ్ల బాగోగులు చూసుకుంటున్నారు. ఒక రోడ్డు ప్రమాదం ఇంతమంది జీవితాల్లో పెను విషాదాన్ని నింపింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.