బెడ్రూంలో భార్య పక్కన మరో వ్యక్తిని చూసిన భర్త కోపంతో...

కాళీచరణ్ బయటకు వెళ్లిన తర్వాత కొంతసేపటికి ఓ యువకుడు అతడి ఇంట్లోకి వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన కాళీచరణ్ కొద్దిసేపటి తర్వాత ఇంట్లోకి వెళ్లాడు.

news18-telugu
Updated: January 18, 2020, 10:08 PM IST
బెడ్రూంలో భార్య పక్కన మరో వ్యక్తిని చూసిన భర్త కోపంతో...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తన బెడ్రూంలో తన భార్య పక్కన మరో వ్యక్తిని చూసిన భర్త కోపంతో దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఆమె ముక్కు, నోరు కొరికేశాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఈ ఘటన జరిగింది. కొత్వాలి పట్టణానికి సమీపంలోని కర్హరా గ్రామానికి చెందిన కాళీచరణ్‌కు అతడి భార్య మీద అనుమానం ఉంది. తాను ఇంట్లో లేని సమయంలో ఎవరో ఓ యువకుడు ఇంటికి వచ్చి వెళుతున్నాడని ఇరుగుపొరుగువారు చెప్పారు. దీంతో తన భార్య మరొకరితో వివాహేతర లైంగిక సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. ఓ రోజు తాను బయటకు వెళ్తున్నట్టు చెప్పాడు. అయితే, కాళీచరణ్ బయటకు వెళ్లిన తర్వాత కొంతసేపటికి ఓ యువకుడు అతడి ఇంట్లోకి వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన కాళీచరణ్ కొద్దిసేపటి తర్వాత ఇంట్లోకి వెళ్లాడు. ఆ సమయంలో తమ బెడ్రూమ్‌లో భార్య, పక్కనే మరో వ్యక్తి సెక్స్ చేసుకుంటున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన కాళీచరణ్ తన భార్య ముక్కు, నోరు కొరికేశాడు. అనంతరం తన భార్యతో సెక్స్ చేస్తున్న యువకుడి మీద దాడి చేశాడు. ఈ క్రమంలో ఇంట్లో నుంచి పెద్ద పెద్దగా అరుపులు, కేకలు విన్న స్థానికులు పరుగున వచ్చి కాళీచరణ్‌ను శాంతింపజేశారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆమె ముక్కు మొత్తం తెగిపోయిందని, పెదాలు కూడా తెగిపోయాయని వైద్యులు తెలిపారు.

First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు