హోమ్ /వార్తలు /క్రైమ్ /

భార్యను చంపేసిన భర్త.. రెండు గంటల్లోనే శిక్ష విధించిన ‘దేవుడు’

భార్యను చంపేసిన భర్త.. రెండు గంటల్లోనే శిక్ష విధించిన ‘దేవుడు’

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెల్లారితే ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పిన కుటుంబం తెల్లారిన తర్వాత ఎంతసేపయినా కనీసం కనిపించకపోవడంతో ఆ ఇంటి యజమాని వెళ్లి వారు అద్దెకు ఉంటున్న ఇంట్లో చెక్ చేశారు. అక్కడ వర్ష రక్తపు మడుగులో పడి ఉంది. ఇల్లంతా చిందరవందరగా అయిపోయింది.

ఓ భర్త తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం రెండు గంటల్లోనే అతడు కూడా చనిపోయాడు. పంజాబ్‌లోని మొహాలీలో ఈ దారుణం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన వారిస్ ఖురేముద్దీన్ (33), భోపాల్‌కు చెందిన యువతి వర్ష చౌహాన్‌తో 2019లో పెళ్లి జరిగింది. వారిపెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా ఇద్దరూ 2019 అక్టోబర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం వారు గురుగ్రామ్‌లో స్థిరపడ్డారు. కానీ, కరోనా వైరస్ కారణంగా వారి ఉద్యోగాలు పోయాయి. దీంతో వారు పంజాబ్‌లోని మొహాలీ వచ్చి ఓ అద్దె ఇంట్లో దిగారు. అయితే, వారిద్దరూ తరచుగా గొడవలు పడుతుండే వారని వారు నివాసం ఉంటున్న ఫ్లాట్‌కు పక్క ఫ్లాట్‌లో ఉండే యువకుడు చెప్పాడు.

ఈ క్రమంలో ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. అర్ధరాత్రి సమయంలో 2 గంటల నుంచి 3 గంటల మధ్య వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ బీభత్సంగా కొట్టుకున్నారు. ఇంట్లో సామగ్రి మొత్తం విసిరి పడేశారు. ఇల్లంతా చిందరవందరగా చేశారు. ఆ కోపంలో వారిస్ ఖురేముద్దీన్ తన భార్యను ఓ పదునైన వస్తువుతో పొడిచి చంపేశాడు.

తెల్లారితే ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పిన కుటుంబం తెల్లారిన తర్వాత ఎంతసేపయినా కనీసం కనిపించకపోవడంతో ఆ ఇంటి యజమాని వెళ్లి వారు అద్దెకు ఉంటున్న ఇంట్లో చెక్ చేశారు. అక్కడ వర్ష రక్తపు మడుగులో పడి ఉంది. ఇల్లంతా చిందరవందరగా అయిపోయింది. వస్తువులు ఎక్కడికక్కడ పడేసి ఉన్నాయి. దీంతో దోపిడీ, హత్య జరిగి ఉంటాయని తొలుత భయపడ్డారు. కానీ, ఆమె భర్త కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి అక్కడ ఏం జరిగిన ఘటనను పరిశీలించి,మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

అయితే, అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల ప్రాంతంలో భార్యను చంపేసిన భర్త కారులో వేగంగా వెళ్తుండగా ఓ ట్రక్కు వచ్చి ఢీకొట్టింది. 3.45 గంటల సమయంలో అతడు ప్రమాదానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు. రోడ్డు ప్రమాదం జరిగిందంటూ పోలీసులకు సమాచారం రావడంతో వారు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆ కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా చెక్ చేయగా అడ్రస్ లభించింది. అయితే, అప్పటికే అతడి భార్య హత్యకు గురైనట్టు తేలింది. దీంతో భర్త హత్య చేసి పారిపోతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. చేసిన తప్పుకి రెండు గంటల్లోనే ‘దేవుడు’ శిక్షించాడంటూ అందరూ మాట్లాడుకోవడం గమనార్హం.

First published:

Tags: Chandigarh S34p01, Crime news, Murder, Punjab

ఉత్తమ కథలు