Sad: ఇతను అసలు మనిషేనా.. అన్యాయంగా మూడేళ్ల కూతురిని పొట్టనపెట్టుకున్నాడు.. అసలేం జరిగిందంటే..

మూడేళ్ల పాప, నిందితుడు ప్రదీప్ యాదవ్

భార్యాభర్తలన్నాక చిన్నచిన్న గొడవలు, అలకలు, బుజ్జగింపులు సహజం. కానీ.. ఆ గొడవలు ముదిరి పాకాన పడితే కాపురంలో కలతలు మొదలవుతాయి. ఆ మనస్పర్థలు తారాస్థాయికి చేరితే విడిపోయే వరకూ భార్యాభర్తలు వెళతారు. అయితే.. చాలా సందర్భాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు కన్నబిడ్డలకు శాపంగా మారుతున్నాయి.

  • Share this:
    అల్వార్: భార్యాభర్తలన్నాక చిన్నచిన్న గొడవలు, అలకలు, బుజ్జగింపులు సహజం. కానీ.. ఆ గొడవలు ముదిరి పాకాన పడితే కాపురంలో కలతలు మొదలవుతాయి. ఆ మనస్పర్థలు తారాస్థాయికి చేరితే విడిపోయే వరకూ భార్యాభర్తలు వెళతారు. అయితే.. చాలా సందర్భాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు కన్నబిడ్డలకు శాపంగా మారుతున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులను బలితీసుకుంటున్నాయి. రాజస్థాన్‌లోని సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు మూడేళ్ల చిన్నారిని బలితీసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. అల్వార్ జిల్లా బెహ్‌రార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గదోజ్ గ్రామానికి చెందిన ప్రదీప్ యాదవ్, మోనిక భార్యాభర్తలు. కొన్నేళ్ల క్రితం వీరికి పెళ్లైంది. మూడేళ్ల పాప కూడా ఉంది. కుటుంబాన్ని సంతోషంగానే చూసుకుంటున్న ప్రదీప్ యాదవ్‌కు కాస్త చాదస్తం ఎక్కువ. ఆచారాల పేరిట భార్యను విసిగించేవాడు. ముసుగు వేసుకునే బయటకు వెళ్లాలని.. ముసుగు తీయవద్దని ఆమెను బలవంతం చేసేవాడు. అయితే.. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన మోనిక అస్తమానం ముసుగు ఎందుకు వేసుకోవాలని.. తాను వేసుకోనని తెగేసి చెప్పింది. సంప్రదాయం ప్రకారమే చీర కట్టుకుంటున్నానని.. మళ్లీ ముసుగు ఎందుకని నిలదీసింది. తన ఇరుగుపొరుగు వారెవరూ అలా ముసుగులు వేసుకుని బయటకు రావడం లేదని.. ఆచారాల పేరుతో తనను విసిగించవద్దని ప్రదీప్ యాదవ్‌కు మోనికా స్పష్టం చేసింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య ఇటీవల ఒక రోజు గొడవ జరిగింది.

    ఈ గొడవ జరుగుతున్న సమయంలో సంయమనం కోల్పోయిన ప్రదీప్ యాదవ్ భార్య ఒడిలో పడుకుని ఉన్న మూడేళ్ల కూతురిని బలవంతంగా లాక్కొని క్షణికావేశంలో నేలకేసి కొట్టాడు. ఆ మూర్ఖపు తండ్రి చేసిన పనికి ఆ పాప విలవిలలాడుతూ కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. రాత్రి సమయంలో గొడవ జరగడంతో ఆ చిన్నారిని గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి పూడ్చిపెట్టి.. ప్రదీప్ యాదవ్ పరారీలోకి వెళ్లిపోయాడు. అతని భార్య మోనికా జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రదీప్ యాదవ్‌పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇలా క్షణికావేశంలో కన్నబిడ్డలను పొట్టనపెట్టుకుంటున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం.

    ఇది కూడా చదవండి: Young Girl Tragic Death: షాకింగ్ ఘటన.. ఈ యువతి ఎలా చనిపోయిందో తెలిస్తే.. ఎవరికైనా గుండె దడరాక మానదు..

    గుజరాత్‌లోని సూరత్‌లో కూడా ఇలాంటి ఘటనే తాజాగా కలకలం రేపింది. సూరత్‌లో ఓ 32 ఏళ్ల మహిళ ఆరో ఫ్లోర్‌లోని టెర్రాస్‌ పై నుంచి కిందకు దూకి చనిపోయింది. పోలీసులు ఆమె ఇంటిని పరిశీలించగా.. ఆమె రెండున్నరేళ్ల కొడుకు మృతదేహం కనిపించింది. ఆ వివాహిత ముందు తన కొడుకును చంపి.. ఆ తర్వాత టెర్రాస్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ మహిళ గర్భిణి కూడా కావడం గమనార్హం. భర్తతో నెలకొన్న విభేదాల కారణంగానే క్షణికావేశంలో ఆ వివాహిత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
    Published by:Sambasiva Reddy
    First published: