హోమ్ /వార్తలు /క్రైమ్ /

Husband: ఎంతటి విషాద ఘటన.. భార్య వివాహేతర సంబంధం వల్ల ఎంత ఘోరం జరిగిందంటే..

Husband: ఎంతటి విషాద ఘటన.. భార్య వివాహేతర సంబంధం వల్ల ఎంత ఘోరం జరిగిందంటే..

రెండేళ్ల కూతురు నిధిని చంపేసి, ఆ తర్వాత భానుప్రియ కూడా ఉరేసుకుని చనిపోయింది. భర్త ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. పోలీసులు మృతదేహాలను కోలార్ జిల్లా ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

రెండేళ్ల కూతురు నిధిని చంపేసి, ఆ తర్వాత భానుప్రియ కూడా ఉరేసుకుని చనిపోయింది. భర్త ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. పోలీసులు మృతదేహాలను కోలార్ జిల్లా ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

పంజాబ్‌లో ఫరీద్‌కోట్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర్ దీనజ్‌పూర్ జిల్లాలోని కలైబరి గ్రామానికి చెందిన ఓ 35 ఏళ్ల వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు పదేళ్ల వయసున్న కూతురు, ఐదు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు.

ఇంకా చదవండి ...

ఫరీద్‌కోట్: వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. కన్నబిడ్డలను అనాథలను చేస్తున్నాయి. అయినప్పటికీ కొందరి తీరు మారడం లేదు. క్షణిక సుఖాల కోసం వెంపర్లాడుతూ బంగారం లాంటి జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తితో కలిసి భార్య వెళ్లిపోయిందన్న విషయం తెలిసి ఆ భర్త గుండె ముక్కలయింది. ఆ మనస్తాపంతో కన్నకొడుకులిద్దరినీ చంపి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన పంజాబ్‌లో ఫరీద్‌కోట్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర్ దీనజ్‌పూర్ జిల్లాలోని కలైబరి గ్రామానికి చెందిన ఓ 35 ఏళ్ల వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు పదేళ్ల వయసున్న కూతురు, ఐదు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఉపాధి నిమిత్తం పంజాబ్ వెళ్లిన ఈ కుటుంబం ఫరీద్‌కోట్‌లోని మిలటరీ స్టేషన్‌లో నివాసం ఉంటోంది. మిలటరీ ఇంజనీర్ సర్వీసెస్‌కు చెందిన ఓ కన్‌స్ట్రక్షన్ సైట్‌లో ఈ వ్యక్తి, అతని భార్య పనిచేస్తున్నారు. ఆ క్రమంలోనే అతని భార్యకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్ని నెలలుగా ఆమె, ఆమె ప్రియుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు.

అంతేకాదు.. తాను వెళ్లిపోతే పిల్లల భవిష్యత్ ఏంటన్న ఆలోచన కూడా లేకుండా ఆ మహిళ కొన్నిరోజుల క్రితం వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తితో కలిసి వెళ్లిపోయింది. ఈ పరిణామంతో భర్త గుండె బద్ధలైంది. తాను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న భార్య ఎడబాటును భరించలేకపోయాడు. కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపంతో మనోవేదన చెందిన ఆ భర్త, ఇద్దరు కొడుకులతో కలిసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో పదేళ్ల కూతురు ఇంట్లోనే ఉంది.

ఇది కూడా చదవండి: Newly Married Woman: పెళ్లయితే జీవితం తనలాగే అందంగా ఉంటుందనుకుని గతేడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకుంటే..

ఈ ఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ.. ఇద్దరు పిల్లలకు ఉరేసి.. అనంతరం ఆ వ్యక్తి కూడా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయినట్లు చెప్పారు. ముగ్గురి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఉరేసుకున్న ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని, అతని భార్య ప్రియుడితో కలిసి ఎక్కడికి వెళ్లిందో ఇప్పటికీ తెలియలేదని పోలీసులు చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని అతని బంధువులకు సమచారం అందించామని.. సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశామని పోలీసులు ఫరీద్‌కోట్ సిటీ పోలీసులు తెలిపారు. భార్య వివాహేతర సంబంధం కట్టుకున్న భర్తను, కన్న బిడ్డలను ఇలా బలి తీసుకోవడం శోచనీయం.

First published:

Tags: Extra marital affair, Husband commits suicide

ఉత్తమ కథలు