పెళ్లైన మూన్నాళ్లకే... భార్యకు వీడియో కాల్ చేసి భర్త ఆత్మహత్య

రెండో షిప్ట్‌లో విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన మహేందర్ పుట్టింటిలో ఉన్న భార్యకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగాడు. అనంతరం తాను చనిపోతున్నానని భార్యకు చెప్పి వీడియో కాల్ చేశాడు.

news18-telugu
Updated: September 21, 2019, 12:17 PM IST
పెళ్లైన మూన్నాళ్లకే... భార్యకు వీడియో కాల్ చేసి భర్త ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భార్యకు వీడియో కల్ చేసి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కలకలం రేపింది. సింగరేణి బొగ్గుగనిలో ఫిట్టర్‌గా పనిచేస్తున్న మహేందర్‌ గోదావరి ఖని కల్యాణ్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతడికి సంగారెడ్డికి చెందిన ప్రియాంకతో మూడునెలల కిందటే వివాహం జరిగింది. ప్రియాంకకు జ్వరం రావడతో మూడురోజుల కిందట మహేందర్ పుట్టింటికి పంపాడు. మహేందర్‌కు మధుమేహం ఉంది. అనారోగ్యంతో ఒత్తిడికి గురయ్యాడు. అనారోగ్య కారణాలతో పలువురు దగ్గర అప్పు తీసుకున్నాడు. రెండో షిప్ట్‌లో విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన మహేందర్ పుట్టింటిలో ఉన్న భార్యకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగాడు. అనంతరం తాను చనిపోతున్నానని భార్యకు చెప్పి వీడియో కాల్ చేశాడు. భార్య చూస్తుండగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మహేందర్ (ఫైల్ ఫోటో)


దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న ప్రియాంక... వెంటనే మహేందర్ చుట్టుపక్కలవారికి ఫోన్ చేసి అప్రమత్తం చేసింది. వాళ్లు వెళ్లి చూసేసరికే మహేందర్ చనిపోయాడు. దీంతో తన భర్త తన కళ్లముందే ఆత్మహత్య చేసుకోవడంతో ప్రియాంక కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అటు మహేందర్ తల్లిదండ్రుల వేదన కూడా అరణ్య రోదనగా మారింది. వాళ్లను ఓదార్చడం ఎవరితరం కాలేదు. అనారోగ్య కారణాలతోనే మహేందర్ తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

First published: September 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading