సెలవులకు ఇంటికి వచ్చిన మరదలిని గర్భవతిని చేసి... చివరకు ఏం జరిగిందంటే...?

పట్టణంలోనే ఉంటున్న తన అక్క ఇంటికి సెలవులు ఉన్నప్పుడు వచ్చి వెళ్లేది. ఈ క్రమంలోనే బావ మరదలి పై కన్నేశాడు. ఆమెను లోబరుచుకొని పలుసార్లు లైంగికదాడి చేసి తన కోర్కెను తీర్చుకున్నాడు.

news18-telugu
Updated: October 13, 2019, 10:18 PM IST
సెలవులకు ఇంటికి వచ్చిన మరదలిని గర్భవతిని చేసి... చివరకు ఏం జరిగిందంటే...?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సెలవల కోసం ఇంటికి వచ్చిన మరదలిపై కన్నేసిన బావ బలవంతంగా తన కోర్కెను తీర్చుకున్నాడు. చివరికి ఆమె గర్భం దాల్చడంతో తప్పించుకోవాలని చూశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాలోని కటక్‌ ప్రాంతానికి చెందిన యువతి అదే ప్రాంతంలో చదువుతూ హాస్టల్ లో ఉంటోంది. పట్టణంలోనే ఉంటున్న తన అక్క ఇంటికి సెలవులు ఉన్నప్పుడు వచ్చి వెళ్లేది. ఈ క్రమంలోనే బావ మరదలి పై కన్నేశాడు. ఆమెను లోబరుచుకొని పలుసార్లు లైంగికదాడి చేసి తన కోర్కెను తీర్చుకున్నాడు. దీంతో యువతి గర్భం దాల్చింది. ఇటీవల ఆ యువతి ఆరోగ్యం బాగాలేదని స్వగ్రామానికి వచ్చింది.

రాత్రి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండగా అసలు విషయం తెలియని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పుడు ఆమె గర్భవతి అని తేలింది. దీంతో బాలికను విచారించగా అసలు నిజం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ అమెరికా భామ అందాలను చూడాలని ఉందా...?First published: October 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు