Home /News /crime /

రెండేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. భార్యను కాపురానికి పంపడం లేదని భర్త ఆత్మహత్య

రెండేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. భార్యను కాపురానికి పంపడం లేదని భర్త ఆత్మహత్య

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లి త‌రువాత కాపురం స‌వ్యంగా సాగాలంటే పెద్ద‌గా ఆస్థులు లేక‌పోయినా ప‌ర్వ‌లేదు.. కానీ కూడు, గుడ్డ‌కు స‌రిప‌డా సంపాద‌న అయినా ఉండాలి. ఇలాంటి క‌నీస అవ‌స‌రాలకు కూడా సంపాదించలేకే ప్రేమ వివాహ‌లు కొద్ది రోజుల్లోనే పెటాకుల‌వుతున్నాయి.

 • News18
 • Last Updated :
  ప్రేమ పెళ్లి అనుకున్నంత ఈజీ కాదు. ఆ సంసార చదరంగంలో ఒకసారి దిగిన తర్వాత దాన్నుంచి బయటపడటం చాలా కష్టం. పెళ్లైన కొత్తలో చూసిన ప్రతి వస్తువూ కొనాలనిపిస్తుంది. కానీ వాటికి స‌రిప‌డా ఆర్ధిక స్థోమ‌త ఉండదు. ఇక సాధారణంగా ప్రేమికులు.. ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాల గురించి అస్సలు పట్టించుకోరు. పెళ్లి అయితే అన్నీ అవే సర్దుకుంటాయిలే అంటూ లైట్ తీసుకుంటారు. కానీ పెళ్లయ్యాకే తెలుస్తుంది అసలు కథ. ఏదైనా మంచి ఉద్యోగం ఉంటే తప్ప.. ఆర్థిక ఇబ్బందులతో ఆ ప్రేమ పెళ్లి కాస్తా పెటాకులవడం ఖాయం.పెళ్లి త‌రువాత కాపురం స‌వ్యంగా సాగాలంటే పెద్ద‌గా ఆస్థులు లేక‌పోయినా ప‌ర్వ‌లేదు.. కానీ కూడు, గుడ్డ‌కు స‌రిప‌డా సంపాద‌న అయినా ఉండాలి. ఇలాంటి క‌నీస అవ‌స‌రాలకు కూడా సంపాదించలేకే ప్రేమ వివాహ‌లు కొద్ది రోజుల్లోనే పెటాకుల‌వుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

  ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం మోస్ర గ్రామానికి చెందిన మహేందర్ గౌడ్.. కామారెడ్డి జిల్లా దోమ‌కొండ మండ‌లం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన మాధవి.. వీరిరువురూ హైదరాబాద్ లో రెండు సంవత్సరాల పాటు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరైనా కుటుంబ‌స‌భ్య‌ుల‌ను ఒప్పించి 2020 ఏప్రిల్ 30 న ప్రేమ‌ వివాహం చేసుకున్నారు. 8 నెలలు సవ్యంగా సాగిన వీరి కాపురంలో చిన్నపాటి కలతలు వచ్చాయి. ఆర్థిక సమస్యలు వీరిని చుట్టుముట్టాయి. దీంతో ఇద్దరి మధ్య గొడవలు తీవ్ర స్థాయికి వెళ్లాయి.

  nizamabad, nizamabad news, suicide, crime news, wife and husband, love marraige ప్రేమ పెళ్లి, నిజామాబాద్, ప్రేమ, భార్యాభర్తలు, భర్తను వదిలేసిన భార్య, నిజామాబాద్ వార్తలు
  మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమవుతున్న భర్త


  అవి కాస్తా ముదిరి.. ఇరువురూ మాట్లాడుకోవడం మానేశారు. భర్తతో ఉంటూ అతడితో తరుచూ గొడవలు పడలేక మాధవి తన పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన మహేందర్ గౌడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చివరి క్షణాల్లో నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది బయటపడ్డాడు.

  కాగా.. బుధవారం నిజామాబాద్ ప్రెస్ క్ల‌బ్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మహేందర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తన భార్య‌కు, తనకు మ‌ధ్య ఇత‌రులు చేరి కాపురంలో చిచ్చుపెడుతున్నారని ఆరోపించాడు. తన భార్య‌ మాధవి తనను కాదని మరో వివాహం చేసుకోవడానికి సిద్ధమైందని తెలిపాడు. తనకు న్యాయం చేయండని పోలీసులను ఆశ్రయించినా.. ఎలాంటి లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వ‌హించి తమ బందాన్ని నిల‌బెట్టాల‌ని అధికారుల‌ను వేడుకున్నాడు.
  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Crime, Crime news, Nizamabad, Telangana, Telangana News

  తదుపరి వార్తలు