కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుంతలం చేసింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కపడుతున్నాయని అనుకున్నంతలోనే సెకండ్ వేవ్ తో విరుచుకుపడుతోంది. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్యుడికి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు అయింది. తాజాగా ఆరు నెలలుగా డబ్బులు లేక తన భార్య కాన్పుకు సంబంధించి డెలివరీకి డబ్బులు లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి గ్రామస్తులు, గౌరారం ఎస్సై వీరన్న తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మొడుసు రాజిరెడ్డి(32) ప్రైవేట్కంపెనీల్లోని మిషనరీకి తుప్పు పట్టకుండా పెయింటింగ్స్ వేసే కాంట్రాక్ట్ పనులు చేసేవాడు.
అయితే కరోనా కారణంగా ఆరు నెలలుగా ఒక్క కాంట్రాక్ట్ కూడా దొరక్కపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఇతనికి రెండేళ్ల పాప, 8 నెలలు గర్భవతి అయిన భార్య అంజలి ఉన్నారు. ప్రస్తుతం ఆమె డెలివరీ కోసం భార్య వాళ్ల పుట్టింటికి వెళ్లింది. కొద్దిరోజులుగా చేతిలో పైసలు లేవు.. కాన్పు దగ్గర పడుతుంది ఏం చేయాలె అని తల్లి అంజమ్మతో పలుమార్లు చెప్పి రాజిరెడ్డి బాధపడ్డాడు. పని కోసం ఎంత ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా అయింది.
తనలో తను మదనపడుతూ మానసికంగా కుంగిపోతూ ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతసేపటికి గమనించిన తల్లి పొరుగువారి సాయంతో కిందికి దించగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య అంజలి కన్నీరుమున్నీరయ్యింది. తన కుమార్తె రోధన అందనిరి కలచివేసింది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attempt to suicide, CM KCR, Crime, Crime news, Gajwel, Harishrao, Husban commits suicide, Siddipeta, Telangana News