భర్త ఆత్మహత్య.. భార్య కేసు పెట్టడంతో మనస్తాపం.. పోలీస్ స్టేషన్ ముందే..

భార్య తనపై కేసు పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇన్నారావు.. పోలీస్ స్టేషన్ ముందే పురుగుల మందు తాగాడు.

news18-telugu
Updated: September 16, 2020, 1:03 PM IST
భర్త ఆత్మహత్య.. భార్య కేసు పెట్టడంతో మనస్తాపం.. పోలీస్ స్టేషన్ ముందే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తన భార్య తనపై పోలీసు కేసు పెట్టడాన్ని ఆమె భర్త తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోకి వట్టిచెరుకూరుకు చెందిన భార్యాభర్తలు ఇన్నారావు, జ్యోతి అలేఖ్య మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ కారణంగా కొంతకాలం క్రితం భార్య జ్యోతి అలేఖ్య ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఇటీవల మళ్లీ ఇంటికి వచ్చింది. అయినా వారి మధ్య గొడవలు ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవల వీరి మధ్య ఉన్న గొడవలు తీవ్రం కావడంతో భర్త ఇన్నారావుపై భార్య జ్యోతి అలేఖ్య పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది.

భార్య తనపై కేసు పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇన్నారావు.. పోలీస్ స్టేషన్ ముందే పురుగుల మందు తాగాడు. దీంతో వెంటనే అతడిని పొన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: September 16, 2020, 1:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading