news18-telugu
Updated: December 1, 2019, 1:34 PM IST
ప్రతీకాత్మక చిత్రం
విజయవాడలో చోటుచేసుకున్నఓ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. భార్యను చంపబోయి భర్త చివరకు తానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలో సింగ్‌నగర్ వాంబే కాలనీలో ఇవాళ ఉదయం ఈ ఘటన జరిగింది. కాలనీలోని నివసిస్తున్న అప్పారావు అనే వ్యక్తి తరచూ భార్యతో గొడవలు పడేవాడు. వ్యాపారం చేస్తున్న అప్పరావుకు నిత్యం భార్యతో గొడవలు తలెత్తేవి. దీంతో భార్యభర్తలు ఎప్పుడుపడితే అప్పుడు ఘర్షణ పడేవారు. ఈ నేపథ్యంలోనే నిన్న అర్థరాత్రి సమయంలో భార్యతో మరోసారి గొడవపడిన అప్పారావు భార్యను హతమార్చాలనుకున్నాడు. భార్యను హత్య చేసేందుకు పథకం ప్రకారం బాటిల్లో పెట్రోల్ తీసుకొచ్చాడు. భార్యపై పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు.ఇంతలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి అప్పారావుని తీవ్రస్థాయిలో మందలించారు.
తెల్లవారుజామున అప్పారావు లేచి ఇంట్లోనే మిగిలిన పెట్రోల్ తనమీద పోసుకొని నిప్పంటించుకున్నాడు. విషయం తెలుసుకొని చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలు ఆర్పగా, అప్పటికే కాలిన గాయాలతో అప్పారావు మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
December 1, 2019, 1:34 PM IST