భార్యపై అత్యాచారం చేస్తున్న యువకుడి మర్మాంగం కోసేసిన భర్త...

తన భార్య మీద ఓ యువకుడు అఘాయిత్యం చేస్తుంటే చూసి తట్టుకోలేక అలా చేశాడంటూ భర్త తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపాడు.

news18-telugu
Updated: October 20, 2019, 9:14 PM IST
భార్యపై అత్యాచారం చేస్తున్న యువకుడి మర్మాంగం కోసేసిన భర్త...
ప్రతీకాత్మక చిత్రం (AFP)
  • Share this:
తన భార్య మీద అత్యాచారం చేస్తున్న యువకుడి మర్మాంగాన్ని ఓ భర్త కోసేశాడు. ఉక్రెయిన్‌లో ఈ దారుణం జరిగింది. భార్యాభర్తలు ఓ పార్టీకి వెళ్లారు. రాత్రి ఒంటి గంటల సమయంలో భార్య ముందే ఇంటికి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన కొంతసేపటికి భర్త కూడా ఇంటిదారి పట్టాడు. అయితే, ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత పెద్దగా కాపాడండి అనే అరుపులు వినిపించాయి. ఇంటి పక్కన ఉన్న పొదల్లో నుంచి ఆ అరుపులు వస్తున్నాయని గ్రహించిన భర్త అక్కడకు వెళ్లి చూడగా.. తన భార్య మీద ఓ యువకుడు అత్యాచారం చేస్తున్నాడు. దీంతో భర్త ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. తన భార్య మీద అత్యాచారం చేస్తున్న వ్యక్తి తలమీద కర్రతో కొట్టాడు. ఆ తర్వాత ఆ యువకుడి మర్మాంగాన్ని ఓ కత్తితో కోసేశాడు.

తన భార్య మీద ఓ యువకుడు అఘాయిత్యం చేస్తుంటే చూసి తట్టుకోలేక అలా చేశాడంటూ భర్త తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. ఆ సమయంలో తానేం చేస్తున్నాడో తనకే తెలియని మానసిక స్థితిలోకి వెళ్లిపోయి ఆ పని చేశాడని చెప్పాడు. తన భార్యను రక్షించుకున్న తర్వాత భర్త సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామానికి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. అత్యాచారం చేయబోయిన వ్యక్తి మీద, మర్మాంగాన్ని కోసేసిన వ్యక్తి మీదా పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో రేప్ చేయబోయిన వ్యక్తికి ఐదేళ్లు, మర్మాంగాన్ని కోసేసిన భర్తకు ఎనిమిదేళ్లు శిక్ష పడొచ్చని అంచనా.

బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని మోదీFirst published: October 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు