'టిక్‌టాక్'లో పరిచయమైన యువతితో రెండో పెళ్లి.. భార్యను మోసం చేసిన భర్త

రెండో పెళ్లి చేసుకుని తనను మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అనురాధ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

news18-telugu
Updated: October 27, 2019, 8:25 PM IST
'టిక్‌టాక్'లో పరిచయమైన యువతితో రెండో పెళ్లి.. భార్యను మోసం చేసిన భర్త
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టిక్‌టాక్ మోజు ఓ దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకి చెందిన సత్యంరాజు అనే వివాహితుడు.. టిక్‌టాక్‌లో పరిచయమైన యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు.2009లో అతనికి అనురాధతో వివాహమైంది. అయితే టిక్‌టాక్ ద్వారా హైదరాబాద్‌కి చెందిన మరో యువతితో
పరిచయం ఏర్పడటంతో.. భార్యకు తెలియకుండా ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. అనురాధకు విషయం తెలిశాక..దానిపై నిలదీసింది. దాంతో రెండో భార్య వద్దకు వెళ్లనని.. పూర్తిగా తనతోనే ఉంటానని మాటిచ్చాడు. కానీ కొన్నాళ్లకు భార్యను దూరం పెట్టి ఆమె వద్దకే వెళ్లి సెటిల్ అయ్యాడు. దీంతో అనురాధ పోలీసులను ఆశ్రయించి సత్యంరాజుపై ఫిర్యాదు చేసింది.రెండో పెళ్లి చేసుకుని తనను మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అనురాధ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

First published: October 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు