కూతురు పుట్టినరోజున ప్రియుడితో భార్య సరసాలు.. కళ్లారా చూసిన భర్త.. చివరికి..

ప్రతీకాత్మక చిత్రం

అక్రమ సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. కట్టుకున్న భర్తలకు చేస్తున్న కొందరు భార్యల గురించి, నమ్మి వెంటొచ్చిన భార్యలను మోసం చేసిన కొందరు భర్తల గురించి ఎన్ని వార్తలొస్తున్నా కొందరిలో...

 • Share this:
  మెదక్: అక్రమ సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. కట్టుకున్న భర్తలకు చేస్తున్న కొందరు భార్యల గురించి, నమ్మి వెంటొచ్చిన భార్యలను మోసం చేసిన కొందరు భర్తల గురించి ఎన్ని వార్తలొస్తున్నా కొందరిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. కోరి కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు. వారి కాపురాలకు వాళ్లే నిప్పంటించుకుంటున్నారు. తాజాగా మెదక్ జిల్లాలో ఈ తరహా ఘటనే వెలుగుచూసింది. వివరాల్లోకెళితే.. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన సంబు అంజయ్య(28) అదే గ్రామానికి చెందిన పెద్దకట్టసాయిలు భార్య లక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భర్త పలుమార్లు హెచ్చరించినప్పటికీ లక్ష్మి ప్రవర్తనలో మార్పు రాలేదు. అంజయ్యకు కూడా అప్పటికే బేతమ్మ అనే యువతితో వివాహమైంది. భర్త వివాహేతర సంబంధం గురించి బేతమ్మకు తెలిసింది. ఆమె ఇదేంటని నిలదీసినప్పటికీ అంజయ్య పట్టించుకోలేదు. ఈ క్రమంలో.. పెద్దకట్టసాయిలు, అతని భార్య లక్ష్మి కలిసి ఫిబ్రవరి 11న ఇంట్లో కుమార్తె పుట్టినరోజు చేశారు.

  అదేరోజు.. రాత్రి కుటుంబ సభ్యులు గమనించడం లేదని భావించిన లక్ష్మి తన ప్రియుడు అంజయ్యతో చనువుగా ఉంది. ఒకే గదిలో వీళ్లిద్దరూ కలిసి ఉండగా సాయిలు, అతని కుటుంబసభ్యులు కళ్లారా చూశారు. దీంతో.. ఇదేం పనని ఇద్దరినీ నిలదీశారు. ఎంత చెప్పినా మారడం లేదని భావించిన లక్ష్మి భర్త సాయిలు, ఆమె కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడు అంజయ్యను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. భర్త హత్యకు అంజయ్య భార్య బేతమ్మ కూడా సహకరించింది. అంజయ్యను హత్య చేయాలని అంతా భావించి ఎల్లుపేటకు చెందిన విస్లావత్ రాజును సంప్రదించారు. హత్యకు సహకరిస్తే రూ.15 వేలు ఇస్తామని ఒప్పందం కుదర్చుకున్నారు.

  అనుకున్న ప్రకారం.. అంజయ్యను దావత్ చేసుకుందామని పిలిచిన సాయిలు కుటుంబం అతిగా మద్యం తాగించి అతడి బైక్‌పైనే ఎల్లుపేట నుంచి ఆరేపల్లి వెళుతుండగా హత్య చేశారు. సాయిలు, రాజు కలిసి అంజయ్య తలపై బండరాయితో మోదారు. ఆ తర్వాత.. ప్లాస్టిక్ ప్యాకింగ్ వైర్‌తో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఫిబ్రవరి 20వ తేదీన పెద్దశంకరం పేటలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు విచారించగా హత్య తామే చేశామని సాయిలు, రాజు ఒప్పుకోవడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
  Published by:Sambasiva Reddy
  First published: