విడాకులు అడిగిందని... భార్యను బతికుండగానే పూడ్చేసిన భర్త...

దాదాపు ఐదేళ్ల తర్వాత వెలుగులోకి మర్డర్ మిస్టరీ... భార్యను కిడ్నాప్ చేసి, బతికుండగానే పూడ్చిపెట్టిన భర్త... సహకరించిన తమ్ముడు, అతని స్నేహితులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 23, 2019, 7:54 PM IST
విడాకులు అడిగిందని...  భార్యను బతికుండగానే పూడ్చేసిన భర్త...
భార్య విడాకులు అడిగిందని... బతికుండగానే పూడ్చేసిన భర్త...
  • Share this:
విడాకులు అడిగిందనే కోపంతో కట్టుకున్న భార్యను బతికుండగానే పూడ్చిపెట్టేశాడో భర్త. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన దాదాపు ఐదేళ్ల తర్వాత వెలుగులోకి రావడం విశేషం. మెక్సికోలో భార్యతో కలిసి నివాసం ఉంటున్న ఈవిల్ రేనే అనే వ్యక్తికీ, అతని భార్యకు మధ్య మనస్పర్థలు చెలరేగాయి. భర్త నుంచి విడాకులు కావాలంటూ అతని భార్య కోర్టుకి ఎక్కింది. మెక్సికో చట్టాల ప్రకారం విడాకులు తీసుకుంటే, భర్త ఆస్తిలో సగ భాగం భార్యకు ఇవ్వాల్సి ఉంటుంది. భార్యకు విడాకులు ఇవ్వడానికి పెద్దగా అభ్యంతరం లేకపోయినా... ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని తెగ ఫీలైపోయాడు ఈవిల్. ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. తమ్ముడు, మరో ఐదుగురితో కలిసి భార్యను చంపేందుకు పథకం పన్నాడు. మెగా ప్లాన్ ప్రకారం... మహిళ కారులో వెళ్తున్నప్పుడు, రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగినట్టు డ్రామా ఆడి, ఆమెను కారు దిగేలా చేశారు. వెంటనే ఆమె చేతులు,కాళ్లు కట్టేసి... కిడ్నాప్ చేశారు. తీసుకెళ్లి ఈవిల్ తమ్ముడికి చెందిన ఓ ఖాళీ స్థలంలో గుంత తవ్వి, అందులో పడేసి పూడ్చేశారు. అక్కడ మహిళ ఉన్నట్టు, హత్య జరిగినట్టు ఎవ్వరికీ అనుమానం రాకుండా సిమెంట్‌తో పూడ్చేశారు. అయితే ఐదేళ్ల తర్వాత ఆ స్థలాన్ని మరో వ్యక్తికి అమ్మాడు ఈవిల్ తమ్ముడు. స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి, భవనం నిర్మించేందుకు అక్కడ తవ్వగా... పూడ్చిపెట్టిన మహిళ మృతదేహం అస్థిపంజరం రూపంలో బయటికి వచ్చింది.

డీఎన్‌ఏ పరీక్షలు చేయగా... ఈవిల్ రేనే భార్య మృతదేహం అని తేలింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈవిల్ రేనేతో పాటు అతని తమ్ముడు కూడా చేసిన నేరాన్ని అంగీకరించారు. వారికి సహకరించిన ఐదుగురితో పాటు ఈ అన్నాదమ్ములకు 51 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది న్యాయస్థానం. జైలుశిక్షతో పాటు రూ.12 లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
First published: April 23, 2019, 7:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading