హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: మీ బావ తోటలో ఉన్నాడట.. వెళ్లి తీసుకొస్తా.. అంటూ అన్నలకు ఫోన్ చేసి చెప్పి మరీ వెళ్లిందా చెల్లి.. తీరా జరిగిందేంటంటే..

Andhra Pradesh: మీ బావ తోటలో ఉన్నాడట.. వెళ్లి తీసుకొస్తా.. అంటూ అన్నలకు ఫోన్ చేసి చెప్పి మరీ వెళ్లిందా చెల్లి.. తీరా జరిగిందేంటంటే..

శ్రీహరి, సుజాత (ఫైల్ ఫొటో)

శ్రీహరి, సుజాత (ఫైల్ ఫొటో)

‘అన్నా, మీ బావ తోటలో ఉన్నాడట. అయిదు రోజులుగా ఇంటికి రావడం లేదు. నేను వెళ్లి తీసుకొస్తా‘ అంటూ అన్నలకు ఫోన్ చేసి చెప్పి మరీ వెళ్లిందామె. కానీ ఎంతకూ తిరిగి రాలేదు. అనుమానంతో వెళ్లి చూస్తే..

అయిదు రోజులుగా ఆ భర్త ఇంటికి రావడం లేదు. ఎక్కడున్నావయ్యా అంటూ ఆ భార్య తన భర్తకు ఫోన్ చేసింది. ’నేను తోటలో ఉన్నా. ఇంటికి రాను. నాతో మాట్లాడాలంటే నువ్వే ఇక్కడకు రా‘ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. భర్తను ఎలాగైనా ఇంటికి రప్పించాలని ఆ భార్య భావించింది. తన సోదరులతో తోటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. ఏమయి ఉంటుందా? అని ఆమె సోదరులు తోటకు వెళ్లి చూశారు. అంతే, అక్కడ జరిగిందేంటో గ్రహించి వణికిపోయారు. సోదరిని చంపి పెట్రోల్ పోసి కాల్చేసి బావ పరారయ్యాడని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా గూడురు పట్టణం దిగువ వీరారెడ్డి పల్లికి చెందిన శ్రీహరి, సుజాతలకు కొన్నేళ్ల క్రితమే పెళ్లయింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా.

కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇరు కుటుంబాల పెద్దలు వచ్చి సర్దిచెబుతూ కాపురాన్ని నడిపిస్తున్నారు. అయితే అయిదు రోజులుగా భర్త శ్రీహరి ఇంటికి రావడం లేదు. పంటను అమ్మగా వచ్చిన డబ్బుతో పేకాట ఆడుతూ జల్సాలు చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సుజాత భర్తకు ఫోన్ చేసింది. ఎక్కడ ఉన్నావని అడిగింది. ‘నేను తోటలో ఉన్నా. ఇక్కడకే రా మాట్లాడుకుందాం‘ అని అన్నాడు. దీంతో సుజాత తోటకు వెళ్లి భర్తకు బుద్ధి చెప్పి ఇంటికి తిరిగి రప్పించాలనుకుంది. ‘మీ బావ తోటలో ఉన్నాడట. నేను వెళ్తున్నా. తీసుకుని వస్తా‘ అని సోదరులకు శుక్రవారం ఫోన్ చేసి చెప్పి వెళ్లింది.

అలా తోటకు వెళ్లిన సుజాత శనివారం కూడా తిరిగి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు తోటకు వెళ్లి అంతా గాలించారు. తోటలో సగం కాలిపోయిన సుజాత మృతదేహాన్ని వాళ్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. సుజాతను చంపి ఆపై ఆమెపై పెట్రోల్ పోసి కాల్చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న శ్రీహరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

First published:

Tags: Crime news, CYBER CRIME, Husband kill wife, Telangana crime, Wife and husband died, Wife kills husband

ఉత్తమ కథలు