• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • HUSBAND BLACKMAILING WIFE WITH NUDE VIDEOS FOR DIVORCE IN ANDHRA PRADESH PRN

Andhra Pradesh: విడాకుల కోసం భర్త నీచ బుద్ధి.. భార్య నగ్నవీడియోలతో..!

Andhra Pradesh: విడాకుల కోసం భర్త నీచ బుద్ధి.. భార్య నగ్నవీడియోలతో..!

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh )గుంటూరు జిల్లా(Guntur District) లో విడాకుల కోసం ఓ భర్త నీచానికి ఒడిగట్టాడు. భార్యను వదిలించుకోవడానికి ఆమె నగ్నవీడియోల (Nude Videos)తో బ్లాక్ మెయిల్ (Blackmail) చేయడం మొదలుపెట్టాడు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో విడాకుల కోసం ఓ భర్త నీచానికి ఒడిగట్టాడు. భార్యను వదిలించుకోవడానికి ఆమె నగ్నవీడియోలతో బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆ కీచక భర్తకు అత్తింటివారు కూడా అతనికే వత్తాసు పలకడంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.., ప్రకాశం జిల్లాకు చెందిన మహిళకు.. గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.లక్ష, 5 సవర్ల బంగారం, ఇంటి సామాన్లు, రూ.10లక్షలు విలువ చేసే ఇంటిస్థలాన్ని ఇచ్చారు. తర్వాత ఇద్దరికీ ఆడపిల్ల పుట్టడంతో భర్త వేధింపులు మొదలయ్యాయి. పాప పుట్టిందన్న కారణంగా పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్త, మామ, ఆడపడుచులు వేధింపులకు గురిచేస్తున్నారు. దీనిపై 2018లోనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్తింటివారిపై పోలీసులు గృహహింస కేసు నమోదు చేశారు. 2019లో భరణం కేసు వేయగా అది కూడా పెండింగ్ లో ఉంది.

    ఈ నేపథ్యంలో ఆమెపై కక్ష పెంచుకున్న భర్త ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. సమీప బంధువు సాయంతో ఫోన్ ట్యాప్ చేసి రికార్డు చేయడంతో పాటు వాటిని భర్యకు పంపి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నాడు. గతంలో భార్య స్నానం చేస్తుండగా రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసిన భర్త.., విడాకులివ్వకపోతే వాటిని ఆన్ లైన్లో పెడతానని బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు దీనికి అతని స్నేహితులతో పాటు, సెల్ ఫోన్ కంపెనీల్లో పనిచేసేవారు కూడా సహకరిస్తున్నారని ఆరోపించింది. భర్తతో పాటు అతనికి సహకరించిన ఆడపడుచు, సెల్ కంపెనీల ప్రతినిథులపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను వేడుకొంది. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు.

    ఇక మరో కేసులో ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో ఓ భార్త భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం, లింగాయపాలెంకు చెందిన అన్నాజీరావుతో.. అదే గ్రామానికి చెందిన సౌజన్యకు 12 ఏళ్ల క్రితం పెళ్లైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. పెళ్లైన నాటి నుంచి అనుమానంతో వేధింపులకు గురిచేస్తున్న భర్త.. క్రమంగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆడపిల్లలు పుట్టారంటూ నిత్యం సూటిపోటి మాటలు అనేవాడు. వారసుడిగా మగపిల్లాడు కావాలని., విడాకులిస్తే మరో పెళ్లి చేసుకుంటానంటూ భార్యను వేధిస్తున్నాడు. ఇటీవల పుట్టింటి నుంచి రూ.5లక్షలు అదనపు కట్నం తీసుకురావాలని.. లేదంటే నువ్వు నాకు అవసరం లేదంటూ ఇంటి నుంచి తరిమేశాడు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీసులు ఆశ్రయించింది.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు