• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • HUSBAND BITES OFF WIFE NOSE AS SHE WOULD NOT COME HOME SSR

Husband: భార్య ముక్కు కొరికేశాడు.. 15 కుట్లు పడ్డాయి.. ఈ భర్త ఎందుకిలా చేశాడో కారణం తెలిస్తే...

Husband: భార్య ముక్కు కొరికేశాడు.. 15 కుట్లు పడ్డాయి.. ఈ భర్త ఎందుకిలా చేశాడో కారణం తెలిస్తే...

విజేందర్ పాల్, ప్రేరణ సైనీ

మే 3న విజేందర్ తన భార్యతో గొడవపెట్టుకుని ఆమె ముక్కు కొరికాడు. ఈ ఘటన మే 3న రాత్రి 7.30 గంటలకు జరిగింది. బలంగా కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆమెను ఆసుపత్రికి తరలించగా 15 కుట్లు పడ్డాయి. పాల్ ఢిల్లీలోని పతర్‌గంజ్‌లో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • Share this:
    ముంబై: ఆమె తన భర్త ప్రవర్తనతో విసిగిపోయింది. ఇక కలిసి ఉండటం కష్టమని భావించి అతనికి దూరంగా వెళ్లిపోవాలనుకుంది. 11 ఏళ్ల కూతురుని తీసుకుని ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లిపోయింది. అయితే.. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలుసుకున్న ఆమె భర్త ఆమెను కలుసుకున్నాడు. భర్తతో వెళ్లేందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఆమె భర్త కోపంతో ఊగిపోయాడు. ఆమె ముక్కును కొరికేశాడు. గాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన విజేందర్ పాల్(36), ప్రేరణ సైనీని(31) కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి 11 సంవత్సరాల వయసున్న పాప ఉంది. ఇటీవల ఈ దంపతులిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం నడుపుతుందేమోనని విజేందర్ అనుమానం పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఆమెను వేధిస్తున్నాడు. ఎవరితో అఫైర్ పెట్టుకున్నావో చెప్పాలని భార్యను సూటిపోటి మాటలతో వేధించడం మొదలుపెట్టాడు. కొన్ని నెలలుగా భర్త వేధింపులను భరిస్తూ వచ్చిన ప్రేరణ ఇక ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకుంది. కూతురుని వెంటబెట్టుకుని భర్తకు తెలియకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ముంబైలోని బంధువుల ఇంటికి వెళ్లిన ప్రేరణ కొన్ని రోజులుగా అక్కడే ఉంటోంది. భార్యను వెతుక్కుంటూ బయల్దేరిన విజేందర్ కొన్ని రోజులకు ఆమె ఆచూకీ కనిపెట్టాడు. ఆమె ముంబైలోని బంధువుల ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడకు వెళ్లాడు. జరిగిందేదో జరిగింది.. ఇక ఇంటికి వెళ్దామని రోడ్డు పక్కన పాలు కొనేందుకు వచ్చిన భార్యను విజేందర్ అడిగాడు. ప్రేరణ భర్తతో కలిసి వెళ్లేందుకు ససేమిరా అనడంతో విజేందర్ ఆమెపై కోపంతో రగిలిపోయాడు.

    మే 3న విజేందర్ తన భార్యతో గొడవపెట్టుకుని ఆమె ముక్కు కొరికాడు. ఈ ఘటన మే 3న రాత్రి 7.30 గంటలకు జరిగింది. బలంగా కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆమెను ఆసుపత్రికి తరలించగా 15 కుట్లు పడ్డాయి. పాల్ ఢిల్లీలోని పతర్‌గంజ్‌లో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్షణికావేశంలో ఇలా జరిగిందని పాల్ చెప్పడం కొసమెరుపు. ఇక.. జరిగిన ఘటన గురించి ప్రేరణ స్పందిస్తూ.. మే 3న తాను పాలు కొనేందుకు బయటకు వెళ్లానని.. తన భర్త కనిపించడంతో అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఆటో ఎక్కానని.. అయితే తాను ఎక్కిన ఆటోను వెంబడించి ఎక్కిన తన భర్త తనతో గొడవ పెట్టుకున్నాడని.. తాను మళ్లీ ఇంటికి రానని చెప్పడంతో ముక్కు కొరికి గాయపరిచాడని చెప్పింది.

    ఇది కూడా చదవండి:  Mothers Day: మదర్స్ డే సందర్భంగా తల్లితో కేక్ కట్ చేయించాలనుకున్నారు.. కానీ పాపం...

    ఆటోలో నుంచి భయంతో పరుగులు తీసిన తనకు ఒక మహిళా ఆటో డ్రైవర్ సాయం చేసిందని ప్రేరణ చెప్పింది. కూపర్ ఆసుపత్రికి తనను తీసుకెళ్లి వైద్యం చేయించగా 15 కుట్లు పడ్డాయని ఆమె తెలిపింది. తన భర్తను కొందరు స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారని ప్రేరణ చెప్పింది. ఇదిలా ఉండగా.. తనకు తన భార్య, పాపంటే చాలా ఇష్టమని, తన కూతురు, భార్యతోనే తాను మళ్లీ ఢిల్లీకి వెళతానని విజేందర్ పాల్ చెప్పడం గమనార్హం.
    Published by:Sambasiva Reddy
    First published: