Bike: పెళ్లయి పట్టుమని రెండు నెలలు కూడా కాలేదు.. బైక్ కోసం ఇలా చేస్తాడని ఆమెకేం తెలుసు పాపం..

పార్వతి దేవి, పవన్ యాదవ్ (ఫైల్ ఫొటో)

ప్రాంతం ఏదైనా దేశంలో వరకట్న వేధింపులకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. కేరళలో ఇటీవల వరుసగా వరకట్న వేధింపులకు సంబంధించిన కేసులు వెలుగులోకొచ్చాయి. తాజాగా.. బీహార్‌లో కూడా ఈ తరహా వేధింపులకు సంబంధించిన వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. తాను కోరుకున్నట్టుగా అదనపు కట్నం తీసుకురాలేదని 22 ఏళ్ల యువతిని పెళ్లైన రెండు నెలలకే హతమార్చాడో కసాయి భర్త.

 • Share this:
  బీహార్: ప్రాంతం ఏదైనా దేశంలో వరకట్న వేధింపులకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. కేరళలో ఇటీవల వరుసగా వరకట్న వేధింపులకు సంబంధించిన కేసులు వెలుగులోకొచ్చాయి. తాజాగా.. బీహార్‌లో కూడా ఈ తరహా వేధింపులకు సంబంధించిన వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. తాను కోరుకున్నట్టుగా అదనపు కట్నం తీసుకురాలేదని 22 ఏళ్ల యువతిని పెళ్లైన రెండు నెలలకే హతమార్చాడో కసాయి భర్త. ఈ దారుణం బీహార్‌లోని శంభూగంజ్‌లో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. పార్వతి దేవి(22) అనే యువతికి, పవన్ యాదవ్ అనే యువకుడికి 2021, జూన్ 19న వివాహమైంది. పార్వతి తల్లిదండ్రులు కట్నమిచ్చి ఉన్నంతలో కూతురి పెళ్లి ఘనంగానే జరిపించారు. ఇటీవల రక్షా బంధన్ సందర్భంగా అత్తారింటి నుంచి పార్వతి దేవి పుట్టింటికి వెళ్లింది. పుట్టింటికి వెళ్లిన భార్యను వెంటనే రావాలని భర్త పవన్ యాదవ్ ఫోన్లు మీద ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టాడు. దీంతో.. రక్షా బంధన్ అయిపోయాక.. మరుసటి రోజే మెట్టినింటికి పార్వతి వెళ్లింది. కానీ.. ఆరోజే ఆమె జీవితంలో చివరి రోజు అవుతుందని కలలో కూడా ఊహించలేకపోయింది. పార్వతి వెళ్లిన రోజు ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా పవన్ యాదవ్ ఆమె తలపై సుత్తితో దాడి చేసి అతి దారుణంగా హత్య చేశాడు. కూతురు హత్యకు గురైన విషయం తెలుసుకుని పార్వతి తండ్రి హుటాహుటిన అల్లుడి ఇంటికి చేరుకున్నాడు.

  రక్తపు మడుగులో పడి ఉన్న కూతురిని విగతజీవిగా చూసి ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. పెళ్లయిన రెండు నెలలకే తన కూతురుని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారంటూ గుండెలవిసేలా రోదించాడు. వివాహం జరిపించిన కొన్ని రోజులకే తనకు బైక్ కొనిపించాలని, రూ.50 వేలు డబ్బు కావాలని అదనపు కట్నం కోసం కూతురిని పవన్ ఇబ్బందులకు గురిచేశాడని ఆమె తండ్రి రాజ్‌కిషోర్ చెప్పాడు. అయితే.. ప్రస్తుతం తన దగ్గర అంత డబ్బు లేదని.. వీలైనంత తొందర్లో కొనిస్తానని చెప్పానని.. ఈలోపే కూతురిపై ఈ కిరాతకానికి ఒడిగట్టాడని ఆయన కన్నీరుమున్నీరయ్యాడు. ఇదిలా ఉంటే.. పవన్ యాదవ్ తండ్రి మాత్రం కొడుకు విషయంలో కొత్త వాదనను తెరపైకి తెచ్చాడు.

  ఇది కూడా చదవండి: Very Sad: ఆరేళ్ల నుంచి ప్రాణంగా ప్రేమించాడు.. కానీ ఆ అమ్మాయి ఈ రేంజ్‌లో షాక్ ఇస్తుందని ఊహించలేకపోయాడు..

  పవన్ తండ్రి చమక్‌లాల్ యాదవ్ మాట్లాడుతూ.. తన కొడుకు మానసిక స్థితి సరిగ్గా లేదని.. భగల్‌పూర్‌లోని ఓ మానసిక వైద్యుడి దగ్గర చికిత్స కూడా తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఎస్‌హెచ్‌వో పంకజ్ కుమార్ రావత్ ఈ ఘటనపై స్పందిస్తూ.. కుటుంబ తగాదాల నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని చెప్పారు. ఆమెను చంపి పారిపోతున్న పవన్ యాదవ్‌ను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారని.. నిందితుడి తండ్రిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆయన తెలిపారు. హత్యకు గురైన పార్వతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బంకా సదర్ హాస్పిటల్‌కు తరలించినట్లు చెప్పారు.
  Published by:Sambasiva Reddy
  First published: