Home /News /crime /

HUSBAND ATTEMPTED AN ACID ATTACK ON HIS WIFE OUT OF A SUSPICION OF INFIDELITY SSR

Husband: బైక్‌ ఆపి భార్యను ఫేస్ మాస్క్ తీయమని ప్రేమగా అడిగాడు.. తీశాక ఊహించని పనిచేశాడు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దినేష్‌‌కు ఓ యువతితో రెండేళ్ల క్రితం పెళ్లైంది. దినేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో వాటర్ ఫిల్టర్ రిపేర్ చేసే పని చేస్తుండగా.. అతని భార్య ఇళ్లలో వంటమనిషిగా పనిచేస్తోంది. పెళ్లైన కొన్నాళ్లు ఇద్దరూ బాగానే ఉన్నారు. కానీ.. కొంత కాలంగా దినేష్ అతని భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భార్య పని చేసేందుకు కొన్ని ఇళ్లకు రోజూ వెళుతుండటంతో ఆ ఇళ్లలో ఏదో ఒక ఇంట్లో ఒకరితో తన భార్య సంబంధం పెట్టుకుందని దినేష్ మనసులో సందేహం మొదలైంది.

ఇంకా చదవండి ...
    పుణె: భార్యాభర్తల మధ్య అనుమానం తలెత్తుకూడదు. ఇద్దరిలో ఏ ఒక్కరిలో ఆ అనుమానం మొదలైనా కాపురంలో కలతలు మొదలవుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగినప్పుడే ఆ సంసారం సాఫీగా సాగుతుంది. లేకపోతే.. ఆ కాపురంలో కల్లోలం రేగినట్టే. ఆ అనుమానం పెను భూతంగా మారి పుణెలో ఓ భర్త నీచానికి పాల్పడ్డాడు. భార్యపై అనుమానంతో ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ఎడమ కంటికి, ఎడమ చేతికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘాతుకానికి పాల్పడిన భర్తపై ఆమె కేసు పెట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెలోని కొంద్వా ప్రాంతంలో నివాసముండే దినేష్‌‌కు ఓ యువతితో రెండేళ్ల క్రితం పెళ్లైంది. దినేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో వాటర్ ఫిల్టర్ రిపేర్ చేసే పని చేస్తుండగా.. అతని భార్య ఇళ్లలో వంటమనిషిగా పనిచేస్తోంది. పెళ్లైన కొన్నాళ్లు ఇద్దరూ బాగానే ఉన్నారు. కానీ.. కొంత కాలంగా దినేష్ అతని భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భార్య పని చేసేందుకు కొన్ని ఇళ్లకు రోజూ వెళుతుండటంతో ఆ ఇళ్లలో ఏదో ఒక ఇంట్లో ఒకరితో తన భార్య సంబంధం పెట్టుకుందని దినేష్ మనసులో సందేహం మొదలైంది. అప్పటి నుంచి భార్య క్యారెక్టర్‌ను తప్పుబడుతున్న దినేష్ ఎవరెవరి ఇళ్లలో పనిచేస్తున్నావో నాకూ ఆ ఇళ్లను చూపించాలని భార్యను ఒత్తిడి చేశాడు. ఆ ఇళ్ల యజమానులు అందుకు ఒప్పుకోరని భార్య చెప్పినా దినేష్ వినిపించుకోలేదు. తాను రావాల్సిందేనని.. ఎవరితో అఫైర్ నడుపుతున్నావో చెప్పాలని భార్యను తిట్టి కొట్టాడు. ఇలా గొడవ జరిగి రోజులు గడిచింది. మళ్లీ ఈ మధ్య ఇదే విషయమై భార్యతో దినేష్ గొడవ పెట్టుకున్నాడు. ఆమెను ఏమీ తెలియనట్టు బైక్‌పై ఎక్కించుకుని బయటకు తీసుకెళ్లాడు. కొంతదూరం వెళ్లాక బైక్ ఆపాడు.

    కొంచెం సేపు మంచిగా మాట్లాడిన దినేష్.. నీ ముఖం చూడాలని ఉందని.. మాస్క్ తీయమని భార్యను కోరాడు. భర్త ప్రేమగా అడిగాడేమోనని భావించిన భార్య మాస్క్ తీసింది. మాస్క్ తీయగానే.. ఆమెపై దినేష్ యాసిడ్ దాడికి యత్నించాడు. తన భార్య ముఖంపై యాసిడ్ పోశాడు. అయితే.. అదృష్టవశాత్తూ ఆమె చేతులు అడ్డం పెట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆమె ఎడమ కంటికి, ఎడమ చేతికి స్వల్ప గాయాలయ్యాయి.

    యాసిడ్ పడిన వెంటనే ఆమె భయంతో కేకలేయడంతో ఏమైందోనని స్థానికులు అక్కడికి వచ్చారు. ఈలోపు దినేష్ తన బైక్‌పై పరారయ్యాడు. బాధిత మహిళ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొంద్వా పోలీసులు 326(ఏ), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే అతనిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Acid attack, Husband, Illicit affair, Pune, Wife

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు