Home /News /crime /

HUSBAND ATTACKS WIFE WITH BELT AND STICKS IN PATANCHERU SANGAREDDY MS

పటాన్‌చెరులో దారుణం.. భార్యపై బెల్టుతో విచక్షణారహితంగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అనూష ఇంటి గేటు తెరుచుకుని లోపలికి వెళ్లిందో లేదో భర్త రఘు ఆమెపై దాడికి దిగాడు. నానా దుర్భాషలాడుతూ ఆమె బ్యాగ్‌ను బయటకు విసిరేశాడు.

    భర్తతో విభేదాల కారణంగా పుట్టింటికి వెళ్లిపోయిన ఓ మహిళ.. సమస్య పరిష్కారం కోసం అత్తింటికి రాగా ఆమెపై తీవ్ర దాడి జరిగింది. అత్త,మామ,సోదరుడితో కలిసి భర్త ఆమెపై దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరులో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హయత్‌నగర్‌కి చెందిన అనూష,పటాన్‌చెరుకు చెందిన రఘు రెడ్డి(26)లకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే పెళ్లి తర్వాత అత్తింటి వేధింపులు ఎక్కువవడంతో 8 నెలల క్రితం అనూష పుట్టింటికి వెళ్లిపోయింది.భర్త వచ్చి తీసుకెళ్తాడని భావించినప్పటికీ.. అతని వైపు నుంచి ఎలాంటి స్పందనా కనిపించలేదు. దీంతో భర్తతో మాట్లాడేందుకు తల్లిదండ్రులతో కలిసి పటాన్‌చెరులోని అత్తింటికి వచ్చింది.

    అనూష ఇంటి గేటు తెరుచుకుని లోపలికి వెళ్లిందో లేదో భర్త రఘు ఆమెపై దాడికి దిగాడు. నానా దుర్భాషలాడుతూ ఆమె బ్యాగ్‌ను బయటకు విసిరేశాడు. ఆపై బెల్టు,కర్రలతో అనూషతో పాటు ఆమె తల్లిదండ్రులపై దాడి చేశాడు. దాడి అనంతరం అనూష ఆమె తల్లిదండ్రులు నేరుగా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Disa Rape and Murder, Patancheru

    తదుపరి వార్తలు