భార్యపై గొడ్డలితో దాడి చేసిన భర్త.. కన్నీరుమున్నీరవుతున్న పిల్లలు..

రక్తపు మడుగులో పడి ఉన్న తల్లి వద్ద రోధిస్తున్న పిల్లలు

గత 10 రోజుల నుంచి భూలక్ష్మిని చంపి జైలుకు వెళ్తానని శ్రీను బెదిరిస్తున్నాడని వారి పిల్లలు చెప్పారు.మద్యానికి బానిసైన తండ్రి తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని.. తల్లిని నిత్యం వేధిస్తున్నాడని తెలిపారు.

  • Share this:
    సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని మునగాల మండలం కలకోవ గ్రామంలో దారుణం జరిగింది.భూలక్ష్మి(35) అనే మహిళపై ఆమె భర్త శ్రీను గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు.రక్తపు మడుగులో పడి ఉన్న భూలక్ష్మిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో.. అక్కడినుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.తల్లి పరిస్థితి చూసి ఆమె పిల్లలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

    గత 10 రోజుల నుంచి భూలక్ష్మిని చంపి జైలుకు వెళ్తానని శ్రీను బెదిరిస్తున్నాడని వారి పిల్లలు చెప్పారు.మద్యానికి బానిసైన తండ్రి తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని.. తల్లిని నిత్యం వేధిస్తున్నాడని తెలిపారు.కాగా,భూలక్ష్మి-శ్రీనుకు 19 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ నేపథ్యంలో 10ఏళ్ల క్రితం తల్లిగారి ఊరైన కలకోవకు వెళ్లిపోయింది.ఆ తర్వాత శ్రీను కూడా అక్కడికే వెళ్లి వారితోనే ఉంటున్నాడు. అయితే అక్కడ కూడా మద్యం అలవాటును మానలేదు.తాగొచ్చి భూలక్ష్మిని వేధించడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో సోమవారం మద్యం మత్తులో ఆమెతో గొడవపడి గొడ్డలితో దాడి చేశాడు.దాడి తర్వాత పరారైన శ్రీను ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.
    Published by:Srinivas Mittapalli
    First published: