నలుగురు ఆడపిల్లలను కన్నదని.. భార్య గొంతుకోసిన భర్త

బలమైన గాయాలు కావడంతో కుప్పకూలిన లలిత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. భార్య చనిపోయిందని భావించిన బాలరాజు అదే కత్తితో గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.

news18-telugu
Updated: August 13, 2020, 8:42 AM IST
నలుగురు ఆడపిల్లలను కన్నదని.. భార్య గొంతుకోసిన భర్త
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తమ ఆడపిల్లలే పుట్టారన్న కోపంతో భార్య గొంతుకోశాడో భర్త. ఆ తర్వాత తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఈ ఘోరం వెలుగుచూసింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. నంద్యాల పట్టణంలోని తెలుగుపేటకు చెందిన లలిత, బాలరాజు దంపతులకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారరు. ఐతే నలుగురూ ఆడపిల్లలనే కన్నదని భార్యతో నిత్యం గొడవపెట్టుకునేవాడు బాలరాజు. ఈ క్రమంలో బుధవారం ఉదయం కూడా వీరి మధ్య వాగ్వాదం జరిగింది. భార్యపై పట్టరాని కోపంతో ఊగిపోయిన భర్త.. కత్తితో ఆమె గొంతుకోసి, తలపై బండరాయితో మోదాడు.

బలమైన గాయాలు కావడంతో కుప్పకూలిన లలిత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. భార్య చనిపోయిందని భావించిన బాలరాజు అదే కత్తితో గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అరుపులు కేకలు విన్న స్థానికులు ఇంట్లోకి వెళ్లడంతో ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. పోలీసులు హుటాహుటిన వారిని నంద్యాల ఆస్పత్రికి తరలించారు. భార్య లలిత పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: August 13, 2020, 8:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading