హోమ్ /వార్తలు /క్రైమ్ /

జడ్జిని రేప్ కేసులో ఇరికించే ప్లాన్... భార్యతో అతడు ఏం చేశాడంటే...

జడ్జిని రేప్ కేసులో ఇరికించే ప్లాన్... భార్యతో అతడు ఏం చేశాడంటే...

కొందరికి అతి తెలివితేటలుంటాయి. ప్లాన్ ప్రకారం ఎదుటివారిని ముంచుతారు. అతడు అలాంటి వాడే. పక్కా స్కెచ్ వేశాడు. దాని ఫలితం ఏమైంది. అది ఎలాంటి పరిణామాలకు దారితీసింది?

హజార్ ఖాన్ (44)... 2016లో హర్యానాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో పనిచేసే నువాను కలిశాడు. తాను డాక్టర్‌ అని చెప్పుకున్నాడు. ప్రేమిస్తున్నానని కల్లబొల్లి మాటలు చెప్పాడు. ఆమె నిజమేనని నమ్మింది. 2017లో ఇద్దరికీ పెళ్లైంది. ఆ తర్వాత టార్చర్ మొదలుపెట్టాడు. మతం మార్చుకోమని ఒకటే గోల. అక్కడితో అయిపోలేదు... అసాధారణ సెక్స్ కోసం ఆమెను ఒత్తిడి చేశాడు. 2018లో మరో డ్రామా. ఓ డాక్టర్ రేప్ చేయబోయాడని పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టమని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. అప్పటి నుంచీ టార్చర్ మరింత ఎక్కువైంది. తాను చెప్పినట్లు చెయ్యాల్సిందే అంటూ చేయిచేసుకోవడం మొదలుపెట్టాడు. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక... తనలో తనే కుమిలిపోయేది నువా.

తాజాగా 2019లో మరో డ్రామాకు తెరతీశాడు. జిల్లా సెషన్స్ జడ్జిపై అతని కన్ను పడింది. ఆ జడ్జి రేప్ చేశాడని ఆరోపిస్తూ... పోలీస్ స్టేషన్‍‌లో కేసు పెట్టమని భార్యను ఒత్తిడి చేశాడు. మొదట వద్దన్న ఆమె... చివరకు భర్త టార్చర్ భరించలేక సరే అంది. జూన్ 29న పోలీసుల్ని కలిసి... గుర్గావ్ కోర్టు జడ్జి తనను రేప్ చేశాడని కేసు పెట్టింది.

ఈ కేసు దర్యాప్తులో ఉండగా... జడ్జికి కాల్ చేశాడు హజార్ ఖాన్. తనకు 10 లక్షలు ఇస్తే, తన భార్యతో కేసు వెనక్కి తీసుకునేలా చేస్తానన్నాడు. ఆ జడ్జి చాలా తెలివైన వారు. తనకు వచ్చిన ఫోన్ కాల్ వాయిస్ రికార్డ్‌ను పోలీసులకు ఇచ్చారు. అంతే... స్టోరీ మారిపోయింది.

పోలీసులు ఆమెను లోతుగా ఎంక్వైరీ చేశారు. అప్పుడు నిజం చెప్పింది. తన భర్త టార్చర్ భరించలేకే... జడ్జిపై డూప్లికేట్ కేసు పెట్టానని చెప్పింది. కట్ చేస్తే... హజార్ ఖాన్‌ను అరెస్టు చేశారు. అతనిపై... దోపిడీ, అసాధారణ సెక్స్, సాక్ష్యాల తారుమారు, నేరపూరిత ఉద్దేశం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

First published:

Tags: Case, Crime, Haryana, National, RAPE

ఉత్తమ కథలు