భార్యాభర్తల గొడవ... సెటిల్ మెంట్ చేసిన పెద్దమనిషి దారుణ హత్య

భార్యాభర్తల మధ్య గొడవ విషయంలో సరైన న్యాయం చెప్పలేదన్న కోపంతోనే ప్రకాష్ ను రమణ హత్యచేసినట్లు సమాచారం.

news18-telugu
Updated: November 30, 2019, 9:05 PM IST
భార్యాభర్తల గొడవ... సెటిల్ మెంట్ చేసిన పెద్దమనిషి దారుణ హత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అనంతపురంలో పట్టపగలే దారుణ ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. ఎమ్మార్పిఎస్ నాయకుడిని ఓ వ్యక్తి కత్తెరతో పొడిచి హతమార్చాడు. అనంతపురం సప్తగిరి సర్కిల్లోని పల్లవి టవర్స్ వద్ద ఎమ్మార్పీఎస్ నాయకుడు జగ్గుల ప్రకాష్, బుక్కరాయ సముద్రంకు చెందిన రమణ ఎదురుపడ్డారు. రమణపై ప్రకాష్ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. తనవెంట తెచ్చుకున్న పదునైన కత్తెరతో ప్రకాష్ పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కత్తెరతో పలుమార్లు కడుపులో పొడవడంతో బాధితుడు తీవ్ర రక్తస్రావంతో అక్కడే కుప్పకూలిపోయాడు. అయినప్పటికి నిందితుడు వదిలిపెట్టకుండా అతడి దాడి చేస్తూనే వున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హఠాత్తుగా జరిగిన దాడిలో తీవ్రంగా రక్తస్రావమై ప్రకాష్ అక్కడిక్కడే మృతిచెందాడు. హత్య అనంతరం పోలీసులు వచ్చే వరకు నిందితుడు అక్కడే కూర్చున్నాడు. స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే నిందితున్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రక్తపుమడుగులో పడివున్న ప్రకాష్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవ విషయంలో సరైన న్యాయం చెప్పలేదన్న కోపంతోనే ప్రకాష్ ను రమణ హత్యచేసినట్లు సమాచారం.

First published: November 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు