కట్టుకున్న భర్త, తమ్ముళ్లతో కలిసి మహిళపై గ్యాంగ్ రేప్...చంపేస్తానని బ్లాక్ ‌మెయిల్

భర్త మరో పెళ్లి చేసుకుంటానని, విడాకులు ఇవ్వాలని ఆమెను కోరాడు. అందుకు ఆ మహిళ నిరాకరించడంతో నరకం చూపించాడు. వరుసకు సోదరులైన ఇద్దరు వ్యక్తులతో కలిసి బాధితురాలిపై సామూహిక అత్యాచారం చేశాడు.

news18-telugu
Updated: December 15, 2019, 6:45 PM IST
కట్టుకున్న భర్త, తమ్ముళ్లతో కలిసి మహిళపై గ్యాంగ్ రేప్...చంపేస్తానని బ్లాక్ ‌మెయిల్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తే మృగాడిగా మారాడు. కట్టుకున్న భార్య అనే కనికరం కూడా లేకుండా, తన సోదరులతో కలిసి మహిళపై అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాధితురాలైన పూనం (పేరు మార్పు) అత్తింట్లో అడుగుపెట్టినప్పటి నుంచి గృహహింసకు గురువుతోంది. గత నెల తన భర్త మరో పెళ్లి చేసుకుంటానని, విడాకులు ఇవ్వాలని కోరాడు. అందుకు ఆ మహిళ నిరాకరించడంతో నరకం చూపించాడు. వరుసకు సోదరులైన ఇద్దరు వ్యక్తులతో కలిసి బాధితురాలిపై సామూహిక అత్యాచారం చేశాడు. అంతేకాదు విడాకులు ఇస్తే సరి లేకపోతే చంపేస్తానని బెదిరించాడు.

దీంతో బాధితురాలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరింది. జరిగిన విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది.

First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>