HUSBAND ALONG WITH FOUR FRIENDS GANG RAPED WOMAN BURNT HER WITH CIGARETTES CASE FILED IN MP INDORE MP MKS
Shocking: స్నేహితులతో కలిసి అసహజరీతిలో భార్యపై గ్యాంగ్ రేప్.. మర్మాంగాలను సిగరెట్లతో కాల్చి..
ప్రధాన నిందితుడు రాజేశ్
ఆమె ప్రభుత్వ టీచర్. మంచి లక్షణాలున్న వరుడి కోసం మ్యాట్రిమొనీ సైట్ ను ఆశ్రయించింది. బుద్ధిమంతుడి పోజులో దర్శనమిచ్చి, సచ్ఛీలుడినని చెప్పుకునే వ్యక్తితో మొత్తానికి పెళ్లి జరిగింది. కొత్తకాపురం పేరుతో ఆమెను ఫామ్ హౌజ్ తీసుకెళ్లాడు. అక్కడ..
పిల్లలకు పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్. మంచి లక్షణాలున్న వరుడి కోసం మ్యాట్రిమొనీ సైట్ ను ఆశ్రయించింది. బుద్ధిమంతుడి పోజులో దర్శనమిచ్చి, సచ్ఛీలుడినని చెప్పుకునే వ్యక్తితో మొత్తానికి పెళ్లి జరిగింది. కొత్తకాపురం పేరుతో ఆమెను ఫామ్ హౌజ్ తీసుకెళ్లాడు. అప్పటికే రెడీగా ఉన్న మరో నలుగురు స్నేహితులతో కలిసి అసహజ రీతిలో భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది పదే పదే రిపీట్ కావడంతో ఆమె తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు చెప్పిన వివరాలివి..
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ వివాహితపై జరిగిన ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తే మృగంలా మారి స్నేహితులతో కలిసి ఆమెపై కిరాతకానికి ఒడిగట్టాడు. 32 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్ రేప్ చేసి, చిత్ర హిసలకు గురిచేసిన ఘటనలో ఆమె భర్తతోపాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తన భర్త, అతని నలుగురు స్నేహితులు కలిసి అసహజరీతిలో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, అత్యాచారం తర్వాత సిగరెట్లతో మర్మాయవాలపై వాతలు పెట్టి టార్చర్ చేశారని ఆరోపిస్తూ బాధితురాలు ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. గ్యాంగ్ రేప్ వద్దంటే చంపేస్తామని బెదిరించారి ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
ఛత్తీస్ గఢ్ కు చెందిన ప్రభుత్వ స్కూల్ టీచరైన మహిళ.. ఓ ప్రఖ్యాత మ్యాట్రిమొని ద్వారా ఇండోర్ కు చెందిన వ్యాపారవేత్త(అని చెప్పుకున్న) రాజేశ్ విశ్వకర్మను పెళ్లి చేసుకుంది. రాయ్ పూర్ హోటల్ లో పెళ్లి తర్వాత ఆమెను ఇండోర్ లోని పిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఫామ్ హౌజ్ కు తీసుకెళ్లి స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు. 2019 నవంబర్ లో ఈ ఘటన జరగ్గా, నాలుగు రోజుల నరకం నుంచి ఎలాగోలా తప్పించుకుని పుట్టింటికి పారిపోయిందా మహిళ. అయినా కూడా..
ఆమెను వెంటాడుతూ భర్త స్నేహితుల్లో ఒకడు ఛత్తీస్ గఢ్ వెళ్లాడు. భర్త కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూ మరోసారి ఆమె ఫామ్ హౌజ్ వచ్చేలా చేశారు. 2021 అక్టోబర్ లో రెండోసారి అదే ఐదుగురు కలిసి మహిళపై అసహజరీతిలో సామూహిక అత్యాచారాకి పాల్పడ్డారు. తాము కోరినప్పుడల్లా రావాలంటూ బాధితురాలిపై బెదిరింపులు పెరగడంతో భరించలేక ఆమె ధైర్యంచేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లోని పలు ప్రాంతాల్లో అరెస్టులు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.