యువతులతో అశ్లీల నృత్యాలు.. నరకకూపంలో 78 మంది..

ఈ బార్లలో పలువురు యువతులు తమకు ఇష్టం లేకపోయినా నిర్వాహకుల ఒత్తిడితో రొచ్చగొట్టే నృత్యాలు చేస్తున్నట్లు గుర్తించి, వారిని విడిపించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, 12 స్పీకర్లు, ఒక కంప్యూటర్, మూడు సౌండ్ సిస్టంలను స్వాధీనం చేసుకున్నారు.

news18-telugu
Updated: April 29, 2019, 5:54 PM IST
యువతులతో అశ్లీల నృత్యాలు.. నరకకూపంలో 78 మంది..
బార్ (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: April 29, 2019, 5:54 PM IST
వారంతా యువతులు.. పొట్ట కూటి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు.. తప్పనిసరి పరిస్థితులు వాళ్లను నరక కూపంలోకి నెట్టాయి. మరో పని వెతుక్కుందామంటే ఎవరూ సాయం చేయరు.. మోసం చేసేవాళ్లే ఎక్కువ. దీంతో లైంగిక, మానసిక వేధింపులతో నరకం అనుభవిస్తున్నారు.. కొందరు బార్ డ్యాన్లర్లు. బార్లలో పని కల్పిస్తామని తీసుకొచ్చి పురుషుల ముందు నగ్నంగా, రెచ్చగొట్టేలా నృత్యాలు చేయాలని నిర్వాహకులు ఒత్తిడి తెస్తారు. పొట్ట నింపుకోవడానికైనా, మనసు చంపుకొని వారంతా అశ్లీల నృత్యాలు చేయాల్సిందే. ఇలా నరకం అనుభవిస్తున్న 78 మందికి విముక్తి కల్పించారు బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచీ పోలీసులు.

కొన్ని బార్లలో మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బెంగళూరులోని బ్రిగేడ్ రహదారిలో ఉన్న బ్రిడ్జ్ నైట్ 6 బార్ సహా మరో బార్‌పై దాడులు చేశారు. ఈ బార్లలో పలువురు యువతులు తమకు ఇష్టం లేకపోయినా నిర్వాహకుల ఒత్తిడితో రొచ్చగొట్టే నృత్యాలు చేస్తున్నట్లు గుర్తించి, వారిని విడిపించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, 12 స్పీకర్లు, ఒక కంప్యూటర్, మూడు సౌండ్ సిస్టంలను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోనూ ఓ బార్‌కు రక్షణగా ఉన్న ఇద్దరు పోలీసు అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. బార్‌లో పనిచేస్తున్న నలుగురు మహిళలు సహా 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.

First published: April 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...