హోమ్ /వార్తలు /క్రైమ్ /

Kabul flight: కాబూల్​లో ఘోరం.. విమానం నుంచి కిందపడిన ఇద్దరు వ్యక్తులు

Kabul flight: కాబూల్​లో ఘోరం.. విమానం నుంచి కిందపడిన ఇద్దరు వ్యక్తులు

విమానం నుంచి కిందపడిపోతున్న మనుషులు(వృత్తంలో), (ఫొటో: ట్విటర్​ సౌజన్యంతో)

విమానం నుంచి కిందపడిపోతున్న మనుషులు(వృత్తంలో), (ఫొటో: ట్విటర్​ సౌజన్యంతో)

సోమవారం తాలిబన్​లు కాబూల్‌లో గస్తీ తిరిగారు. అక్కడి ప్రజలు పారిపోయే ప్రయత్నంలో వేలాది మంది కాబుల్​ విమానాశ్రయాన్ని ఆశ్రయించారు. కాబూల్ విమానాశ్రయం సమీపంలో కొందరు వ్యక్తులు విమానం చక్రాల పక్కన దాక్కుని ప్రయాణించారని, విమానం గాల్లోకి ఎగిరాక  సమీపంలోని ఇళ్ల పైకప్పుపై పడటం చూశారని స్థానిక మీడియా చెబుతోంది.

ఇంకా చదవండి ...

ఆఫ్ఘనిస్తాన్‌(Afghanistan)లో తాలిబన్ల విజృంభణకు అడ్డూ అదుపు ఉండట్లేదు. వారి దాడి కొనసాగుతోంది. కొద్దిరోజులుగా ఒక్కొక్క నగరాన్నీ తమ వశం చేసుకుంటూ వస్తోన్న తాలిబాన్లు(Taliban's) మొత్తం ఆఫ్ఘనిస్తాన్‌ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆయా ప్రావిన్సుల రాజధానులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు తాలిబాన్లు. అయితే ఆప్ఘన్​లో ఉన్న వివిధ దేశాల పౌరులను తిరిగి వెనక్కి వచ్చేయాల్సిందిగా ఇప్పటికే వారివారి దేశాలు సూచనలు జారీచేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్‌(Taliban)ల ఆక్రమణ కారణంగా పెద్ద సంఖ్యలో జనం దేశం విడిచి పారిపోతున్నారు. తట్టా బుటా సర్ధుకుని దొరికిన వాహనం ఎక్కి వెళ్లిపోతున్నారు. కాబూల్​ విమానాశ్రయం అయితే అక్కడి ప్రజలతో నిండిపోయింది. విమానాల్లో జనం కిక్కిరిసి ఉన్నారు. ముందు బతికితే చాలురా దేవుడా అనుకుంటున్నారు. ఎలాగోలా దేశం విడిచి వెళ్లడానికి ప్రాణాలకు తెగించి ముందుకెళుతున్నారు. అయితే కాబూల్(Kabul) విమానాశ్రయం(airport) నుంచి బయలుదేరిన విమానం నుంచి ఇద్దరు ప్రయాణికులు కిందపడటం సంచలనం రేకెత్తించింది. కాబుల్​లో పరిస్థితికి ఇది అద్దం పడుతుంది. విమానం లోపల చోటు లభించక పోవడంతో చాలామంది విమానం(flight) రెక్కలపై కూర్చున్నారు. అయితే విమానం గాలిలో టేకాఫ్ అయిన కాసేపటికే వారిలో ఇద్దరు(two) కింద పడిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్​ మీడియా(social media)లో చక్కర్లు కొడుతోంది.  మీడియా ఈ విజువల్స్‌ను ప్రముఖంగా ప్రసారం చేస్తోంది. ఈ వీడియో(video)లో ఇద్దరు వ్యక్తులు పడిపోవడం కనిపిస్తుంది.

తాలిబన్లు రాజధాని కాబూల్‌(Kabul)ను స్వాధీనం చేసుకున్న తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. దేశం విడిచి వెళ్లడానికి ప్రజలు విమానాశ్రయానికి పరుగులు పెడుతున్నారు.  ఆ దేశంలో వివిధ సరిహద్దు క్రాసింగ్‌లను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. తాలిబన్ల నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు ఆఫ్ఘనిస్తాన్‌(Afghanistan) విడిచిపెట్టి సురక్షిత ప్రాంతానికి వెళ్లడానికి కాబోల్ విమానాశ్రయం ఒక్కటే మార్గం. దీంతో ఎయిర్​పోర్టు(airport)కు జనం తాకిడి అధికమైంది. ఓ మీడియా కథనం ప్రకారం.. కాబూల్ విమానాశ్రయంలో జరిగిన కాల్పుల్లో ఐదారుగురు మరణించారని తెలుస్తోంది. ఆఫ్ఘన్ రాజధాని నుంచి బయలుదేరిన వందలాది మంది ప్రజలు బలవంతంగా విమానాలలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో వారిపై బుల్లెట్లు పేలాయి. అదే సమయంలో మరో ప్రత్యక్ష సాక్షి ఐదుగురి మృతదేహాలను వాహనాల్లో తీసుకెళ్లడం చూశానని చెప్పాడు. అయితే.. కాబూల్ విమానాశ్రయం నియంత్రణ మాత్రం ఇప్పటికీ అమెరికన్ సైనికుల చేతిలోనే ఉండటం గమనార్హం.

సోమవారం తాలిబన్​లు కాబూల్‌లో గస్తీ తిరిగారు. అక్కడి ప్రజలు పారిపోయే ప్రయత్నంలో వేలాది మంది కాబుల్​ విమానాశ్రయాన్ని ఆశ్రయించారు. కాబూల్ విమానాశ్రయం సమీపంలో కొందరు వ్యక్తులు విమానం చక్రాల పక్కన దాక్కుని ప్రయాణించారని, విమానం గాల్లోకి ఎగిరాక  సమీపంలోని ఇళ్ల పైకప్పుపై పడటం చూశారని స్థానిక మీడియా చెబుతోంది. యుఎస్ ఎయిర్ ఫోర్స్ విమానం వెంట వందలాది మంది ప్రజలు పరుగెత్తుతున్నట్లు, విమానం రెక్కలపై ప్రజలు గుంపులుగా కూర్చుని ఉన్నారని అక్కడి మీడియా వార్తలు వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఆదివారం రాత్రి దేశం నుంచి పారిపోయారు. తాలిబాన్లు కేవలం 10 రోజుల్లో అన్ని నగరాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, తాలిబాన్లు తమ కత్తులు, తుపాకులతో విజయం సాధించారని, ఇపుడు తమ దేశస్థుల గౌరవం, ఆస్తి, సంరక్షణకు బాధ్యత వహిస్తారని ఘని చెప్పారు. కాగా, తాలిబాన్లు నగరం అంతటా తనిఖీ కేంద్రాలను స్వాధీనం చేసుకుని అధ్యక్ష భవనంలోకి ప్రవేశించారు.

First published:

Tags: Accident, Afghanistan, Crime news, Flight, International news, Passengers, Taliban, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు