Home /News /crime /

HUGE FIRE DESTROYS DELHI GOVERNMENT BUS ON ROAD VIDEO GOES VIRAL PAH

Fire accident: నడిరోడ్డుపై బీభత్సం.. బస్సులో చెలరేగిన భారీ మంటలు.. దట్టంగా అలుముకున్న పోగ.. కారణం ఏంటంటే..

బస్సుకు అంటుకున్న మంటలు

బస్సుకు అంటుకున్న మంటలు

Huge Fire Destroys: బస్సులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రోడ్డు పైన ఉన్న వారంతా.. షాకింగ్ గురయ్యారు. చూస్తుండగానే మంటలు బస్సుకు వ్యాపించాయి.

Delhi Government Bus fire accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దకిణ ఢిల్లీ లోని మహిపాల్ పూర్ ప్రాంతంతో ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ)లో మంటలు వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బస్సు నుంచి నల్లటి పొగలు అలుముకున్నాయి. ఆనంద్ విహార్ ఐఎస్ బిటి నుంచి మెహ్రోలీకి వెళ్లే రూట్ లో నడుస్తున్న బస్సులో మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. బస్సు అప్పుడే డిపో నుంచి బయటకు వచ్చింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వ్యాపించాయి.

గాలులు వేగంగా వ్యాపిస్తుండటంతో మంటలు అక్కడే ఉన్న దుకాణాలలో అంటుకున్నాయి. డ్రైవర్ వెంటనే బస్సు నుంచి దూకేశాడు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఎనిమిది ఫైర్ ఇంజన్ లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఫైర్ అధికారులు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోనికి తీసుకొని వచ్చారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. బస్సులో మంటలు చెలరేగడానికి సాంకేతిక పరమైన లోపాలే కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశాలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.





ఢిల్లీలో ఈ రోజు మరో అగ్ని ప్రమాదం కూడా జరిగింది.

Fire breaks out a house in Badli extension: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బద్లీ ఎక్స్ టెన్షన్ పరిధిలోని ఒక ఇంట్లో మంటలు వ్యాపించాయి. దీంతో నిముషాల్లోనే ఇంటి చుట్టు మంటలు చెలరేగాయి. ఆ ఇంట్లోని వారు మంచి నిద్రలో ఉన్నారు. ఈ క్రమంలో.. మెళకువ రావడంతో చూశారు. మంటలు అన్ని వైపుల నుంచి వ్యాపిస్తున్నాయి. పొగలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే ఇంట్లోని వారంతా బయటకు పరుగులు తీశారు.

ఇంట్లో చెలరేగిన మంటల్లో ఎనిమిది మంది ఉన్నట్లు గుర్తించారు. స్థానికుల సమాచారంలో ఫైర్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే మంటలలో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడారు. తెల్లవారు జామున మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు.  పోలీసులు ముందు జాగ్రత్తగా.. ఆ ప్రాంతంలో.. అంబులెన్స్ లను మోహరించారు. స్థానికుల సహాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు

ఎలాంటి ప్రాణనష్టం జరక్క పోవడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోనికి వచ్చాయని అధికారులు తెలిపారు. మంటలు చెలరేగడానికి కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా.. తీవ్ర భయాందోళనలకు గురయ్యారు
Published by:Paresh Inamdar
First published:

Tags: Buses, Delhi, Fire Accident

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు